యూఏఈలో 5 బ్యాంకులు, 2 బీమా కంపెనీలకు Dh2.62 మిలియన్లు ఫైన్..!!

- March 26, 2025 , by Maagulf
యూఏఈలో 5 బ్యాంకులు, 2 బీమా కంపెనీలకు Dh2.62 మిలియన్లు ఫైన్..!!

యూఏఈ: యూఏఈలో పనిచేస్తున్న ఐదు బ్యాంకులు, రెండు బీమా కంపెనీలకు పన్ను నిబంధనలను పాటించనందుకు జరిమానా విధించినట్లు యూఏఈ సెంట్రల్ బ్యాంక్ (CBUAE) ప్రకటించింది. కామన్ రిపోర్టింగ్ స్టాండర్డ్ (CRS),  ఫారిన్ అకౌంట్ టాక్స్ కంప్లైయన్స్ యాక్ట్ (FATCA) మార్గదర్శకాల ప్రకారం.. అవసరమైన ట్యాక్స్ విధానాలను నివేదించడంలో విఫలమైనందుకు బ్యాంకులు, బీమా కంపెనీలపై సెంట్రల్ బ్యాంక్ మొత్తం Dh2,621,000 ఆర్థిక ఆంక్షలు విధించింది.

CBUAE అన్ని లైసెన్స్ పొందిన ఆర్థిక సంస్థలకు సరిదిద్దడానికి తగినంత సమయం ఇచ్చినప్పటికీ, సంస్థలు ప్రమాణాలను పాటించడంలో విఫలమైనందున, ఆంక్షలు విధించినట్టు తెలిపింది.  ఇలాంటి చర్యలు యూఏఈ ఆర్థిక వ్యవస్థ నాణ్యతను పెంచుతుందని, పన్ను వ్యవస్థల సమగ్రత పారదర్శకతను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని CBUAE వెల్లడించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com