సౌదీ అరేబియాలో డెంగ్యూ జ్వరంపై సర్వే..!!
- March 26, 2025
రియాద్: సౌదీ పబ్లిక్ హెల్త్ అథారిటీ (వెకాయా) మరో కార్యక్రమానికి తెరతీసింది. రాజ్యం అంతటా డెంగ్యూ జ్వరం ఎపిడెమియోలాజికల్ పరిస్థితిని అధ్యయనం చేయడానికి విస్తృతమైన సర్వే ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం 12 నెలల్లోపు పూర్తిచేయాలని నిర్ణయించబడింది. రాజ్యంలోని అన్ని ప్రాంతాలలో డెంగ్యూ జ్వరం ఎపిడెమియోలాజికల్ పరిస్థితిని అధ్యయనం చేయడానికి దీర్ఘకాలిక, విస్తృతమైన సర్వే కార్యక్రమాన్ని అమలు చేయడానికి అధికారులు ప్రణాళికులు రూపొందించారు.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. డెంగ్యూ జ్వరం దోమల కాటు ద్వారా సంక్రమించే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ముఖ్యంగా పేద పట్టణ ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా వ్యాపిస్తుంది. డెంగ్యూ తరచుగా లక్షణరహితంగా ఉంటుంది. సాధారణంగా సంక్రమణ తర్వాత 3 నుండి 14 రోజుల తర్వాత లక్షణాలు కన్పిస్తాయి. వీటిలో అధిక జ్వరం, తలనొప్పి, వాంతులు, కండరాలు-కీళ్ల నొప్పులు , చర్మంపై దురద-దద్దుర్లు కన్పిస్తాయి. డెంగ్యూ జ్వరం ఏడిస్ ఈజిప్టి దోమ కాటు ద్వారా ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపిస్తుంది.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







