సోషల్ మీడియా అరెస్టులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
- March 26, 2025
అమరావతి: ఏపీ పోలీసుల పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరు పోలీసుల వైఖరితో ఆ వ్యవస్థను నమ్మే పరిస్థితి లేకుండా పోతోందని ఫైర్ అయింది. ఇందులో భాగంగానే హైకోర్టులో కూర్చునే న్యాయమూర్తులకు వీధుల్లో జరిగే విషయాలు ఏవీ తెలియవని భ్రమపడొద్దని పోలీసులను హెచ్చరించింది. ఈ మేరకు సోషల్ మీడియా అరెస్ట్‌లను హైకోర్టు తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వ్యంగ్యంగా విమర్శిస్తూ వీడియోలు, పోస్టులు పెడితే అరెస్టు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా అయితే అలాంటి సినిమాలు తీసే దర్శకులు, హీరోలు, విలన్లను కూడా అరెస్టు చేయాలని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఇందులో భాగంగానే గుంతలు పూడ్చాలి అంటే ఊరూరా టోల్ కట్టాల్సిందే అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ప్రేమ్ కుమార్ అనే వ్యక్తిపై దోపిడీ, బలవంతపు వసూళ్ల సెక్షన్ల కింద కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించింది. ఫిర్యాదు అందిన వెంటనే కర్నూలు నుంచి వచ్చి గుంటూరులో ఉన్న ప్రేమ్ కుమార్‌ను తెల్లవారుజామునే అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని కర్నూలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ సీఐని నిలదీసింది. ఈ మేరకు కేసు విచారణ సందర్భంగా హైకోర్టు సీఐపై మండిపడింది. మిగతా కేసుల్లో ఇంతే వేగంగా స్పందిస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ఎన్ని కేసులను మెరుపు వేగంతో విచారించారంటూ ప్రశ్నించింది.
ఈ కేసుకి సంబంధించి పూర్తి రికార్డులను తమ ముందు పొందుపరచాలని సీఐ, సంబంధిత మెజిస్ట్రేట్‌కు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. కాగా, ప్రేమ్‌కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. గుంతలు పూడ్చాలి అంటే ఊరూరా టోల్ కట్టాల్సిందే అంటూ అందులో తెలిపాడు. దీంతో ప్రేమ్‌కుమార్ పోస్టుపై కర్నూలు టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు గుంటూరుకు చెందిన ప్రేమ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. దీని అనంతరం తన తండ్రి అరెస్టుపై ప్రేమ్‌కుమార్ కుమారుడు కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు సీఐపై మండిపడింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







