ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!
- March 27, 2025
యూఏఈ: 2025కు సంబంధించి యూఏఈ ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా నిలిచింది. ఈ మేరకు క్రౌడ్ సోర్స్డ్ ఆన్లైన్ డేటాబేస్ అయిన నంబియో విడుదల చేసిన సర్వేలో వెల్లడించారు. సర్వే డేటా ప్రకారం, 200 కంటే ఎక్కువ జాతీయులకు నిలయమైన యూఏఈ 84.5 భద్రతా సూచిక పాయింట్లను సాధించింది.
ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య ఉన్న స్కీ రిసార్ట్లకు ప్రసిద్ధి చెందిన చిన్న దేశం అండోరా.. 84.7 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. గల్ఫ్ దేశాలు అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ల కంటే ముందు వరుసలో ఉన్నాయ. ఖతార్ మూడవ స్థానంలో ఉంది. ఒమన్ మొదటి ఐదు స్థానాల్లో నిలిచింది. ఖతార్ భద్రతా సూచిక 84.2తో ఉండగా, ఒమన్ 81.7 పాయింట్లతో ఉంది.
సౌదీ అరేబియా 76.1 భద్రతా సూచిక పాయింట్లతో జాబితాలో 14వ స్థానంలో ఉండగా, బహ్రెయిన్ 75.5 పాయింట్లతో 16వ స్థానంలో, కువైట్ 67.2 భద్రతా సూచిక పాయింట్లతో 38వ స్థానంలో ఉంది.
పాకిస్తాన్ 56.3 పాయింట్లతో 65వ స్థానంలో ఉంది. ఇండియా 55.7 భద్రతా సూచిక పాయింట్లతో 66వ స్థానంలో ఉంది. ఫిలిప్పీన్స్ 56.9 పాయింట్లతో 63వ స్థానంలో ఉంది. నేపాల్ 63.3 పాయింట్లతో 47వ స్థానంలో ఉంది. యూకే 51.7 భద్రతా సూచిక పాయింట్లతో 87వ స్థానంలో ఉండగా, యునైటెడ్ స్టేట్స్ 50.8 పాయింట్లతో 89వ స్థానంలో ఉంది. ప్రపంచ సంతోష సూచిక 2025లో యూఏఈ 21వ స్థానంలో నిలిచింది. యూకే, యూఎస్, జర్మనీ, ఫ్రాన్స్, సింగపూర్, అన్ని అరబ్ దేశాల కంటే పైన నిలిచింది.
క్రౌడ్ సోర్స్డ్ గ్లోబల్ డేటా వెబ్సైట్ నంబియో ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సర్వే చేయబడిన దాదాపు 400 నగరాల్లో అబుదాబి, దుబాయ్ ,షార్జాలు అత్యల్ప నేరాల రేటు కలిగిన టాప్ 10 ప్రపంచ నగరాల్లో వరుసగా రెండవ, ఆరవ, ఏడవ స్థానాల్లో నిలిచాయి.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!