Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!

- March 27, 2025 , by Maagulf
Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!

యూఏఈ: యూఏఈలో కొత్తగా ప్రవేశపెట్టిన బీమా పథకం భారతీయ బ్లూ-కాలర్ కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. సహజ లేదా ప్రమాదవశాత్తు మరణం సంభవించినప్పుడు.. Dh32 ప్రీమియానికి Dh35,000 కవరేజీని అందిస్తుంది. దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, భారతీయ బ్లూ-కాలర్ కార్మికుల యజమానులు, బీమా ప్రొవైడర్లు, నెక్సస్ ఇన్సూరెన్స్ బ్రోకర్లు, దుబాయ్ నేషనల్ ఇన్సూరెన్స్ (DNI) మధ్య సమన్వయంతో తక్కువ ప్రిమియంతో ప్యాకేజీని ఏర్పాటు చేసిందని దుబాయ్‌లోని భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్ తెలిపారు. ఇది దురదృష్టవశాత్తు మరణించే కార్మికుల కుటుంబాలకు చాలా కీలకమైన మద్దతును అందిస్తుంది. సహజ మరణాన్ని కూడా కవర్ చేస్తుంది. యూఏఈ మాత్రమే కాకుండా,  ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా బీమా వర్తిస్తుందన్నారు. పాక్షిక, పూర్తి వైకల్యాన్ని కూడా కవర్ చేస్తుందని పేర్కొన్నారు.  ఇది మృత దేహాలను స్వదేశానికి తరలించడాన్ని కూడా కవర్ చేస్తాయని ఆయన చెప్పారు. 

"ఇది ప్రపంచంలో ఎక్కడికైనా మృత దేహాలను స్వదేశానికి తరలించడానికి, నామమాత్రపు రుసుము అయిన Dh32 తో పాక్షిక, పూర్తి వైకల్యాన్ని కవర్ చేస్తుంది. దుబాయ్ నేషనల్ ఇన్సూరెన్స్ మరో ప్రతిపాదనతో మా వద్దకు వచ్చింది. ఇది Dh35,000 కవరేజ్ అందిస్తుంది. ఇప్పుడు మృత దేహాలను రవాణా చేయడానికి Dh12,000 వరకు ఇవ్వబడుతుంది." అని పేర్కొన్నారు.

యూఏఈలోని భారతీయ కార్మికుల కోసం మార్చి 1, 2024న ప్రారంభించిన లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్.. ప్రమాదాలు లేదా సహజ కారణాల వల్ల ఉద్యోగి మరణించినా.. పాక్షికంగా, పూర్తిగా వైకల్యం పాలైతే, సంవత్సరానికి Dhs 72 బీమా ప్రీమియంతో కుటుంబాలకు Dhs 75,000 వరకు పరిహారం అందిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com