ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!

- October 15, 2025 , by Maagulf
ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!

మస్కట్: ఒమన్ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సంవత్సరం ప్రాంతీయ ఇతివృత్తమైన "ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించడం" పిలుపునకు అనుగుణంగా ఒమన్  పర్యావరణ అథారిటీ నేతృత్వంలోని సమగ్ర జాతీయ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.  ఒమన్ వ్యాప్తంగా పర్యావరణ సవాళ్లపై అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 

ప్లాస్టిక్ షాపింగ్ బ్యాగ్ పరిమితులను దశలవారీగా అమలు చేయడం, కఠినమైన పర్యావరణ చట్టాలు, అధునాతన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలు, పర్యావరణ హిత ఇంధన వనరులకు మారడం సహా అనేక అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు పర్యావరణ అథారిటీ తెలిపింది.

ఈ సమగ్ర అవగాహన ప్రచారంలో ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్‌ను పరిష్కరించే ప్రత్యేక సెమినార్లు, ప్లాస్టిక్ నీటి కంటైనర్లతో సంబంధం ఉన్న ఆరోగ్య సమస్యలను హైలైట్ చేసే వర్క్‌షాప్‌లు ఉన్నాయని పేర్కొంది. ప్లాస్టిక్ వినియోగ తగ్గింపును లక్ష్యంగా చేసుకుని పాఠశాలు, కమ్యూనిటీలలో కార్యక్రమాలను విస్తరించనున్నట్లు అథారిటీ వెల్లడించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com