వ్యాట్ నుంచి ఆ ఆహారపదార్థాలకు మినహాయింపు
- July 06, 2016
జిసిసి దేశాల్లో వ్యాట్ అమల్లోకి వచ్చిన తరువాత అందులోంచి కొన్ని ఆహార పదార్థాలకు మినహాయింపు ఇవ్వనున్నారు. 2018 నాటికి జిసిసి దేశాల్లో వ్యాట్ అమల్లోకి రానుంది. ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా వ్యాట్ని అమల్లోకి తీసుకురానున్నారు. అయితే హెల్త్ కేర్, ఎడ్యుకేషనల్ మరియు సోషల్ సర్వీసులను ఈ వ్యాట్ నుంచి మినహాయిస్తారు. అలాగే, కొన్ని ఆహార పదార్థాలపై వ్యాట్ని మినహాయించనున్నారు. తాజా పళ్ళు, టీ, గోధుమలు, పంచదార, ఇన్ఫాంట్ మిల్క్ ఫుడ్స్, అన్ కుక్డ్ పాస్తా మరికొన్ని ఆహార పదార్థాలకు వ్యాట్ నుంచి మినహాయింపు ఉంటుందని ఇవై ఒమన్ ఆఫీస్ మేనేజింగ్ పార్టనర్ అహ్మద్ అమోర్ అల్ ఎస్రి చెప్పారు. లగ్జరీ ఐటమ్స్ ధరలు వ్యాట్ కారణంగా పెరుగుతాయనీ, బెవరేజెస్లోనూ ఈ పెరుగుదల కనిపిస్తుందని ఆయన అంచనా వేశారు. కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాల ధరలూ పెరిగే అవకాశం ఉంది. బేసిక్ ఫుడ్ ఐటమ్స్ మీద మాత్రం వ్యాట్ మినహాయింపు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!







