తీవ్రవాదాన్ని అణచివేయక తప్పదు
- July 06, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ముందస్తు దాడుల ద్వారా తీవ్రవాదానికి చెక్ పెట్టవచ్చునని అభిప్రాయపడింది. దేశాన్ని తీవ్రవాదం నుంచి రక్షించాలంటే, ఇదొక్కటే మార్గమని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఇంటీరియర్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ అల్ ఖాలెద్ అల్ హమాద్ అల్ సబా చెప్పారు. తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపడానికి సంబంధించి ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాల్నిపరిగణనలోకి తీసుకున్నారు. జిసిసి దేశాలతో సంయుక్తంగా తీవ్రవాదంపై పోరాటం చేయాల్సి ఉంటుందనీ, అప్పుడే జిసిసి రీజయన్ తీవ్రవాదుల నుంచి ఉపశమనం పొందుతుందని తెలిపారు షేక్ మొహమ్మద్. ఈద్ అల్ ఫితర్ సందర్భంగా దేశంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడంతోపాటు, అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంటున్నట్లు వివరించారాయన.
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







