ఈద్ అల్ ఫితర్..దుబాయ్ లో ఉచిత పబ్లిక్ పార్కింగ్..!!
- March 29, 2025
యూఏఈ : మల్టీ-లెవల్ పార్కింగ్ టెర్మినల్స్ మినహా, ఈద్ అల్ ఫితర్ సెలవుల సందర్భంగా దుబాయ్‌లోని అన్ని పబ్లిక్ పార్కింగ్ ఉచితం. ఉచిత పార్కింగ్ వ్యవధి షవ్వాల్ 1 నుండి 3 వరకు నడుస్తుందని, చెల్లించిన పార్కింగ్ ఫీజులు షవ్వాల్ 4న తిరిగి ప్రారంభమవుతాయని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది.
ఈద్ సందర్భంగా దుబాయ్ మెట్రో ఆపరేటింగ్ గంటలను పొడిగించనుంది. రెడ్, గ్రీన్ లైన్ స్టేషన్లు మార్చి 29 ఉదయం 5 గంటల నుండి 1 గంటల వరకు (మరుసటి రోజు); మార్చి 30 ఉదయం 8 గంటల నుండి 1 గంటల వరకు (మరుసటి రోజు); మార్చి 31 నుండి ఏప్రిల్ 2 వరకు ఉదయం 5 గంటల నుండి 1 గంటల వరకు (మరుసటి రోజు) పనిచేయనున్నాయి.
దుబాయ్ ట్రామ్ మార్చి 29 నుండి 31 వరకు ఉదయం 6 నుండి 1 గంట వరకు (మరుసటి రోజు) నడుస్తుంది. మార్చి 30న మాత్రం ట్రామ్ సేవలు ఉదయం 9 గంటలకు ప్రారంభమై 1 గంట వరకు (మరుసటి రోజు) కొనసాగుతాయి.
అల్ గుబైబా బస్ స్టేషన్ నుండి E100 బస్సు రూట్ రంజాన్ 28 (శుక్రవారం) మధ్యాహ్నం నుండి షవ్వాల్ 3 వరకు సర్వీసులు నిలిపివేయబడతాయని RTA ప్రకటించింది. ఈ సమయంలో ప్రయాణీకులు ఇబ్న్ బటుటా బస్ స్టేషన్ నుండి అబుదాబికి E101 రూట్‌ను ఉపయోగించాలని సూచించారు. అంతేకాకుండా, రూట్ E102 రంజాన్ 28 నుండి షవ్వాల్ 3 వరకు నిలిపివేయనున్నట్లు తెలిపింది. పబ్లిక్ బస్సులు, సముద్ర రవాణా సేవల పూర్తి సేవా సమయాలను RTA వెబ్‌సైట్ లేదా యాప్‌లో చూడవచ్చని సూచించారు.
షవ్వాల్ 1 నుండి 3 వరకు వాహన పరీక్షా కేంద్రాలు మూసివేయబడతాయి. షవ్వాల్ 4న సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయి. అదే సమయంలో కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్లు కూడా మూసి ఉంటాయి. ఉమ్ రమూల్, దీరా, అల్ బర్షా, అల్ కిఫాఫ్, ఆర్టీఏ ప్రధాన కార్యాలయాల్లోని స్మార్ట్ కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్లు యథావిధిగా 24/7 పనిచేస్తూనే ఉంటాయని ప్రకటించారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







