మెగ్నీషియం లోపం ఉంటే శరీరంలో ఈ లక్షణాలు కనపడతాయి
- March 29, 2025
రీరానికి కావాల్సిన ముఖ్యమైన మినరల్ మెగ్నీషియం. ఇది ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎముకలు, కండరాలు, నరాలు, గుండె పనితీరుకు మెగ్నీషియం అవసరం. జీవక్రియ సరిగ్గా జరగాలన్న, నాడీ వ్యవస్థ మెరుగ్గా ఉండాలన్నా మెగ్నీషియం అవసరం. అయితే, మెగ్నీషియం లోపం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మెగ్నీషియం లోపాన్ని హైపోమాగ్నేసిమియా అంటారు.ఇది శరీరంలో అనేక రకాల సమస్యలను కలిగిస్తుంది. దీనిని సకాలంలో గుర్తించకపోతే, అది తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. శరీరంలో మెగ్నీషియం లోపం ఉంటే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాల్ని సకాలంలో గుర్తించి అలర్ట్ అవ్వాలి. లేదంటే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. ఇంతకీ ఆ లక్షణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మెగ్నీషియం లోపం ఉంటే కనిపించే అత్యంత సాధారణ లక్షణం కండరాల తిమ్మిరి, ఒత్తిడి, నొప్పి. మెగ్నీషియం కండరాలను సడలించడానికి, వాటి సంకోచాలను నియంత్రించడానికి సాయపడుతుంది. దీని లోపం వల్ల, కండరాలు బిగుసుకుపోతాయి. దీనివల్ల కాళ్ళు, వీపు, మెడలో నొప్పి వస్తుంది. కొన్నిసార్లు ఈ నొప్పులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ నొప్పుల వల్ల రాత్రి వేళల్లో సరిగ్గా నిద్ర కూడా పట్టదు.
మెగ్నీషియం రక్త నాళాలను సడలించడానికి, రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. దాని లోపం ఉంటే, రక్త నాళాలు కుంచించుకుపోవచ్చు. ఇది రక్తపోటును పెంచుతుంది. రక్తపోటు అకస్మాత్తుగా పెరిగితే, అది మెగ్నీషియం లోపానికి సంకేతం కావచ్చు. ఇలా తరచుగా జరిగితే వెంటనే అలర్ట్ అవ్వండి. డాక్టర్‌ని సంప్రదించి తగిన సలహా తీసుకోండి.
మెగ్నీషియం.. గుండె కండరాలు సరిగ్గా పనిచేయడానికి సాయపడుతుంది. దీని లోపం వల్ల హృదయ స్పందన సక్రమంగా ఉండదు. ఈ పరిస్థితిని అరిథ్మియా అంటారు. ఈ పరిస్థితి తీవ్రమైనది. గుండె సమస్యలకు దారితీస్తుంది. తరచుగా హార్ట్ బీట్‌లో మార్పులు గమనిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి. వెంటనే వైద్యుణ్ని సంప్రదించి తగిన సలహాలు తీసుకోండి.
కారణం లేకుండా అలసిపోయినట్లు అనిపిస్తే అది మెగ్నీషియం లోపానికి సంకేతం కావచ్చు. శరీరంలో బలహీనత అనిపిస్తే అది కూడా మెగ్నీషియం లోపానికి సంకేతం కావచ్చు. శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయడానికి మెగ్నీషియం చాలా అవసరం. మెగ్నీషియం లోపం ఉంటే, శరీరం తగినంత శక్తి అందదు. దీంతో, అలసట, బలహీనత, నీరసం వంటి లక్షణాలు తరచుగా కనిపిస్తాయి.
మెగ్నీషియం లోపం మెదడును కూడా ప్రభావితం చేస్తుంది. దీని లోపం వల్ల ఆందోళన, నిరాశ, భయం, మానసిక స్థితిలో మార్పులు వంటి సమస్యలు వస్తాయి. మెగ్నీషియం మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లను నియంత్రించడంలో సాయపడుతుంది. దీంతో, మెగ్నీషియం లోపం మానసిక అసమతుల్యతకు కారణమవుతుంది. మెగ్నీషియం లోపం వల్ల తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు వస్తాయి. మెగ్నీషియం రక్త నాళాలను సడలించడం ద్వారా మైగ్రేన్ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీకు తరచుగా తలనొప్పి వస్తుంటే, అది మెగ్నీషియం లోపానికి సంకేతం కావచ్చు.
మెగ్నీషియం లోపం వల్ల జీర్ణవ్యవస్థ కూడా ప్రభావితమవుతుంది. దీని లోపం వల్ల మలబద్ధకం, అజీర్ణం, కడుపు తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. మెగ్నీషియం పేగు ఆరగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెగ్నీషియం లోపం జీర్ణ ప్రక్రియను నెమ్మదిస్తుంది. దీంతో, జీర్ణ సమస్యలు పెరిగే ప్రమాదముంది.
మెగ్నీషియం లోపం వల్ల నిద్ర సమస్యలు వస్తాయి. ఇది శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడంలో, నిద్ర హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తి చేయడంలో సాయపడుతుంది. మెగ్నీషియం లోపం వల్ల నిద్ర లేమి సమస్యలు వస్తాయి. అంటే సరిగ్గా నిద్ర పట్టదు. రాత్రిళ్లు పదే పదే మెలకువ వస్తుంది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల అనంతరం కతార్‌లో ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
- ఎయిర్ ఇండియా మిడిల్ ఈస్ట్ విమానాలను నిలిపివేత
- నివాసితులను అప్రమత్తంగా ఉండాలని కోరిన దుబాయ్ సెక్యూరిటీ సర్వీస్
- కతార్ పై మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన GCC ప్రధాన కార్యదర్శి
- బహ్రెయిన్ వైమానిక పరిధిని తాత్కాలికంగా నిలిపివేత
- కువైట్ తాత్కాలికంగా వైమానిక పరిధి మూసివేత
- శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం
- ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: ఎండీ వీసీ సజ్జనర్
- భారత్‌కి క్రూడాయిల్ విషయంలో ఇబ్బంది లేదు: హర్దీప్ సింగ్
- చెన్నై పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్..