ప్రపంచవ్యాప్తంగా ఈద్ అల్-ఫితర్ ప్రకటనలు..!!
- March 30, 2025
దోహా, ఖతార్: ప్రపంచవ్యాప్తంగా రమదాన్ ముగింపు, ఈద్ అల్-ఫితర్ మొదటి రోజును సూచిస్తూ షవ్వాల్ కోసం నెలవంకను చూడటం గురించి ప్రకటించడం ప్రారంభించాయి.
ఆస్ట్రేలియా ఈద్ అల్ ఫితర్ మొదటి రోజును మార్చి 31( సోమవారం) అని నిర్ధారించింది, దేశంలో రమదాన్ 30 రోజులు పూర్తి అవుతుందని తెలిపింది.
బ్రూనై, మలేషియా కూడా మార్చి 31న ఈద్ అల్ ఫితర్ జరుపుకుంటామని ప్రకటించింది. మార్చి 2న ఉపవాసం ప్రారంభమైనందున, రమదాన్ 29 రోజులు కొనసాగుతుందని వెల్లడించాయి.
ఇండియా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, పాకిస్తాన్ దేశాల నెలవంక వీక్షణ కమిటీలు కూడా ఈద్ అల్-ఫితర్‌ను మార్చి 31(సోమవారం) న జరుపుకుంటామని ధృవీకరించాయి. షవ్వాల్ నెలవంక ఆదివారం కంటికి కనిపించే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రమదాన్ 30 రోజులు పూర్తి అవుతుందని, ఫలితంగా మార్చి 30న రమదాన్ చివరి రోజుగా ఉంటుందని, ఈద్ అల్ ఫితర్ మార్చి 31న వస్తుందని తెలిపింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







