బహ్రెయిన్ కోస్ట్ గార్డ్ అదుపులో నలుగురు మత్స్యకారులు..!!

- March 30, 2025 , by Maagulf
బహ్రెయిన్ కోస్ట్ గార్డ్ అదుపులో నలుగురు మత్స్యకారులు..!!

మనామా: “కోఫా” అని పిలువబడే నిషేధిత బాటమ్ ట్రాలింగ్ వలలను ఉపయోగించి అక్రమ రొయ్యల వేటలో పాల్గొన్నందుకు బహ్రెయిన్ కోస్ట్ గార్డ్.. ఫిష్ట్ అల్-జార్మ్ ప్రాంతంలో నలుగురు మత్స్యకారులను అరెస్టు చేసింది. రొయ్యల వేటపై కాలానుగుణ నిషేధాన్ని కూడా ఈ మత్స్యకారులు ఉల్లంఘించినట్లు వెల్లడించారు. 

సముద్ర వనరులను రక్షించడానికి కట్టుబడి ఉన్నామని, అక్రమ ఫిషింగ్ పద్ధతులను నిశితంగా పర్యవేక్షిస్తామని, ఇలాంటి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తామని కోస్ట్ గార్డ్ కమాండ్ బహ్రెయిన్ స్పష్టం చేసింది.  మత్స్యకారులు నిర్దేశిత చట్టాలను పాటించాలని సూచించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com