పీక్ సీజన్‌లో ఎక్స్ టెర్నల్ ఆపరేటర్లకు.. ఒమన్ అనుమతి..!!

- March 30, 2025 , by Maagulf
పీక్ సీజన్‌లో ఎక్స్ టెర్నల్ ఆపరేటర్లకు.. ఒమన్ అనుమతి..!!

మస్కట్: వేసవి, శీతాకాలం సమయంలో దోఫర్ గవర్నరేట్‌కు.. ముఖ్యంగా మస్కట్-సలాలా, సోహార్-సలాలా మార్గాల్లో దేశీయ విమానాలను నడపడానికి ఒమన్ పౌర విమానయాన అథారిటీ (CAA) ఎక్స్ టెర్నల్ కంపెనీలను అనుమతిని జారీ చేసింది. 

పీక్ సీజన్లలో అవసరమైన సేవలు అందించేందుకు జాతీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలు, చార్టర్ ఆపరేటర్లు,  లీజింగ్ కంపెనీల నుండి అథారిటీ ప్రతిపాదనలను ఆహ్వానించింది.

1. సమ్మర్ పీక్ : జూలై 1, 2025 నుండి ఆగస్టు 31, 2025 వరకు

2. వింటర్ పీక్ : డిసెంబర్ 1, 2025 నుండి జనవరి 31, 2026 వరకు

ఈ కాలంలో ధోఫర్‌కు విమాన ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడం, సజావుగా కనెక్టివిటీని నిర్ధారించడం ఈ చొరవ లక్ష్యమని పేర్కొన్నారు. ఆసక్తిగల పార్టీలు మరిన్ని వివరాల కోసం [email protected] లో అధికారులను సంప్రదించాలని వెల్లడించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com