నేటి నుంచి కొత్త రూల్స్

- April 01, 2025 , by Maagulf
నేటి నుంచి కొత్త రూల్స్

న్యూ ఢిల్లీ: ప్రభుత్వం తాజా ఆర్థిక సంవత్సరం ప్రారంభం సందర్భంగా పన్ను మినహాయింపుల్లో కొన్ని కీలక మార్పులను తీసుకువచ్చింది.స్టాండర్డ్ డిడక్షన్ రూ.75,000తో కలుపుకుని మొత్తం రూ.12.75 లక్షల వరకు ఆదాయపైన పన్ను మినహాయింపు లభించనుంది.ఈ మార్పులు మధ్య తరగతి ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఊరటనివ్వనున్నాయి.అదనంగా, నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) వాత్సల్యలో పెట్టుబడులకు సెక్షన్ 80CCD(1B) కింద పన్ను మినహాయింపు వర్తించనుంది.

సీనియర్ సిటిజన్లకు అదనపు సౌకర్యం

సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయంలో టాక్స్ మినహాయింపు పెంచబడింది. బ్యాంకుల్లో డిపాజిట్ల ద్వారా వారికి లభించే వడ్డీపై రూ.1 లక్ష వరకు టిడిఎస్ (TDS) మినహాయింపు లభించనుంది. 60 ఏళ్లలోపు ఇతర ఖాతాదారులకు ఈ మినహాయింపు రూ.50,000 వరకు మాత్రమే వర్తించనుంది.ఈ నిర్ణయం వృద్ధులకు ఆర్థిక భద్రత పెంచేలా ఉపయోగపడనుంది.

డిజిటల్ లావాదేవీల భద్రతను పెంపొందించే చర్యలు

ఈ కొత్త నిబంధనలతో డిజిటల్ లావాదేవీలు మరింత సురక్షితంగా మారే అవకాశం ఉంది. బ్యాంకింగ్ మరియు ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా, వినియోగదారులకు అనుకూలంగా మార్చేందుకు తీసుకున్న ఈ నిర్ణయాలు విస్తృత ప్రయోజనాలను కలిగించనున్నాయి. కొత్త మార్పుల ద్వారా పన్ను చెల్లింపుదారులు, బ్యాంక్ ఖాతాదారులు, డిజిటల్ లావాదేవీలు చేసే వారు లబ్ధిపొందనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com