వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- October 13, 2025
కువైట్: వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసన్స్ అమ్మకాలపై కువైట్ కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ ఉత్పత్తులను వెండింగ్ యంత్రాల ద్వారా ప్రదర్శించవచ్చని, విక్రయించవచ్చని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అబ్దేల్-వహాబ్ అల్-అవధి ఉత్తర్వులను జారీ చేశారు. నిర్దేశిత ప్రమాణాల ఆధారంగా ఎలక్ట్రానిక్‌గా దరఖాస్తులను సమర్పించి, అనుమతి తీసుకోవాలని నిర్దేశించారు.
సదరు ఫార్మసీలు చెల్లుబాటు అయ్యే ఆపరేటింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, యంత్రాలను పర్యవేక్షించడానికి లైసెన్స్ పొందిన ఫార్మసిస్ట్ లేదా టెక్నీషియన్‌ను నియమించాలని ఉత్తర్వుల్లో వెల్లడించారు. ప్రతి ఫార్మసీ గరిష్టంగా ఐదు వెండింగ్ మెషీన్లను నిర్వహించవచ్చు. ప్రతి యంత్రానికి లైసెన్స్ ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుందని, అన్ని అవసరాలను తీర్చిన తర్వాత పునరుద్ధరించబడుతుందన్నారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







