'జనతా గ్యారేజ్ ' టీజర్ విడుదల

- July 06, 2016 , by Maagulf
'జనతా గ్యారేజ్ ' టీజర్ విడుదల

తెలుగు ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ చింత్రంలో టెంపర్ చూపించగా సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాడు. ఈ రెండు చిత్రాలు సూపర్ డూపర్ హిట్ కాగా తాజాగా శ్రీమంతుడు డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్ ' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మువీ జనతా గ్యారేజ్ టీజర్ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం రిలీజ్ పై ఇప్పటికే ఎన్నో సంచలన కథనాలు రాగా ఎన్టీఆర్ ఫ్యాన్ హడావుడి మొదలైన విషయం తెలిసిందే. రంజాన్ పండుగ దృష్టిలో పెట్టుకొని ఈ టీజర్ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సినిమా కోసం పలువురు ఎగబడుతున్నారు. ఇప్పటికే రైట్స్ కోసం భారీ రేట్స్ ఆఫర్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా మరో సంచలనానికి తెరలేపింది.

ఏకంగా ఆడియో రైట్స్ కోసమే అదిరిపోయే రేట్ పలుకుతున్నట్టు సమాచారం. జనతా గ్యారేజ్ ఆడియో హక్కుల కోసం సుమారు కోటి రూపాయలు చెల్లించబోతున్నట్టు సమాచారం. నాన్నకు ప్రేమతో వంటి మ్యూజికల్ హిట్ తర్వాత మరోసారి ఎన్టీఆర్ సినిమా ఆడియెన్స్ ను అలరించడం ఖాయమన్న భావనలో ఉన్న ఇండస్ట్రీ వర్గాలు దానికి తగ్గట్టుగానే భారీ ఆఫర్స్ ఇస్తున్నాయి. ఇప్పటికే జనతా గ్యారేజ్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఎన్టీఆర్ పుట్టిన రోజున రిలీజ్ చేయగా వాటిక విపరీతమైన క్రేజ్ వచ్చింది. తాజాగా ఇప్పుడు జనతా గ్యారేజ్ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ లో అందరూ అనుకున్నట్లుగా ఎన్టీఆర్ మాస్ లుక్స్ లో, క్లాస్ లుక్స్ తో 'బలవంతుడు బలహీనున్ని భయపెట్టి బతకడం ఆనవాయితీ.. బట్ ఫర్ ఏ చేంజ్..ఆ బలహీనుడి పక్కన ఓ బలం ఉంది.. జనతా గ్యారేజ్.. ఇక్కడ అన్నీ రిపేర్ చేయబడును'. అదరగొడుతున్నాడు.
యాక్షన్, సెంటిమెంట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఈ సంవత్సరం మరో బ్లాక్ బ్లస్టర్ కాగలదని సినీ పండితులు చెబుతున్నారు. అదే గనక నిజమైతే జూనియర్ ని ఇక ఎవ్వరూ ఆపలేరు. మరోవైపు సినిమా ఆడియో వేడుకను ఈనెల 22 న నిర్వహించబోతున్నట్టు సమాచారం. హైదరాబాద్ లో భారీగా ఆడియో వేడుక నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి జనతా గ్యారేజ్ టీజర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com