యూఏఈలో సాలిక్ ఫీ మినహాయింపు..ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

- April 02, 2025 , by Maagulf
యూఏఈలో సాలిక్ ఫీ మినహాయింపు..ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

యూఏఈ: రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) అమలు చేసిన ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అయిన సాలిక్..ఎమిరేట్ అంతటా ఏర్పాటు చేసిన పది టోల్ గేట్లలో దేనినైనా వాహనాలు దాటినప్పుడు ప్రీపెయిడ్ ఖాతా నుండి టోల్ ఫీ ఆటోమెటిక్ గా డెబిట్ అవుతోంది. 

కాగా, సాలిక్ ఒక మినహాయింపు పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా కొంతమంది నివాసితులు, వారి బంధువులు టోల్ ఫీ మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.  

సాలిక్ ఫీ మినహాయింపుకు ఎవరు అర్హులు?

  •  మానసిక వైకల్యాలు, శారీరక వైకల్యాలు, ఆటిజం, విజిబిలిటీ వైకల్యాలు
  • సదరు సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి బంధువుల కోసం సాలిక్ ఫీ మినహాయింపు కోసం అనుమతిని పొందవచ్చు. అర్హత కోసం ఆమోదయోగ్యమైన సంబంధాలలో తల్లిదండ్రులు, భర్త లేదా భార్య (వివాహ ఒప్పందం అవసరం), పిల్లలు (జనన ధృవీకరణ పత్రం అవసరం), తాతామామలు, సోదరీమణులు లేదా సోదరులు,  మనవరాళ్ళు వారి తరఫున అప్లే చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలతో ఇమెయిల్‌కు([email protected]) పంపాలి.

మినహాయింపు ఎంతకాలం ఉంటుంది?

  • మినహాయింపు చెల్లుబాటు ఒక సంవత్సరం. ఏదైనా ఉల్లంఘనలను నివారించడానికి కస్టమర్ దానిని వార్షిక ప్రాతిపదికన పునరుద్ధరించుకోవాలి.  
  • దరఖాస్తు చేసుకునే ప్రక్రియ
  • నివాసితులు సలిక్ వెబ్‌సైట్ ద్వారా లేదా [email protected] కు ఇమెయిల్ పంపవచ్చు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com