TGSRTC తార్నాక ఆస్పత్రిలో ఎమర్జెన్సీ కేర్ యూనిట్ విస్తరణ
- April 02, 2025
హైదరాబాద్: తమ ఉద్యోగులకు మరింత మెరుగైన వైద్య సేవలందించడంలో భాగంగా తార్నాక ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ కేర్ యూనిట్‌ను విస్తరించాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం ఆ యూనిట్‌లో 4 బెడ్‌లుండగా.. వాటికి అదనంగా 8 బెడ్‌లను సంస్థ ఏర్పాటు చేయనుంది. దీంతో 12 బెడ్‌ల ఎమర్జెన్సీ కేర్ యూనిట్ ఆర్టీసీ ఉద్యోగులకు అందుబాటులోకి రానుంది.
ఈ యూనిట్ విస్తరణకు సీఎస్ఆర్ కింద నిధులు కేటాయించాలని ఆర్టీసీ అధికారులు పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ అయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) అంగీకరించింది. ఈ మేరకు రూ.కోటి సాయం చేసేందుకు ముందుకువచ్చింది. నిర్మాన్ డాట్ ఓఆర్‌జీ అనే స్వచ్చంద సంస్థ ద్వారా ఈ యూనిట్‌ను ఐఓసీఎల్ విస్తరించనుంది. దీంతో పాటు ఆర్టీసీ ఉద్యోగులకు సీపీఆర్‌పై శిక్షణను ఇచ్చేందుకు ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుకు సహకరించనుంది.
హైదరాబాద్ బస్ భవన్‌లో బుధవారం తార్నాక ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ కేర్ యూనిట్‌ను విస్తరణకు సంబంధించిన ఒప్పందం టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ సమక్షంలో జరిగింది. ఐఓసీఎల్, నిర్మాణ్ డాట్ ఓఆర్‌జీ ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ తార్నాక ఆస్పత్రిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ కేర్ యూనిట్‌ను విస్తరిస్తున్నామని, అందుకు సహకరిస్తోన్న ఐఓసీఎల్ యాజమాన్యానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలోనే 12 బెడ్ల ఎమర్జెన్సీ కేర్ యూనిట్‌తో పాటు క్యాథ్‌ల్యాబ్ సేవలు ఉద్యోగులకు అందుబాటులో వస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐవోసీఎల్ ప్రతినిధులు ఎస్‌సీ మెస్‌రాం, పి.కైలాష్ కాంత్, వీవీఎస్ చక్రవర్తి, నిర్మాన్ డాట్ ఓఆర్‌జీ సీవోవో పుల్లా అనురాధతో పాటు తార్నాక ఆస్పత్రి సూపరిటెండెంట్ డాక్టర్ శైలజా మూర్తి, మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్‌లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్‌లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్‌లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్‌నగర్‌లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







