అమెరికా ఆంక్షలు.. ఆ 7 సంస్థలు 'దేశంలో పనిచేయడం లేదు' : యూఏఈ
- April 05, 2025
యూఏఈ: సుడాన్లో కార్యాకలాపాలు నిర్వహిస్తున్నాయంటూ యూఏఈ కంపెనీలపై అమెరికా ఆంక్షల విధించింది. అయితే, దీనిపై యూఏఈ స్పందించింది. యూఎస్ ఆంక్షలు విధించిన ఆ ఏడు కంపెనీలు యూఏఈలో చెల్లుబాటు అయ్యే వాణిజ్య లైసెన్సులు లేవని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు తమ దేశంలో సదరు కంపెనీలు పనిచేయడం లేదని న్యాయ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
జనవరి 7న అమెరికా తన సుడాన్ ఆంక్షల కార్యక్రమం కింద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న ఏడు సంస్థలపై చర్యలు తీసుకుంది. ఈ సంస్థలలో క్యాపిటల్ ట్యాప్ హోల్డింగ్ LLC, క్యాపిటల్ ట్యాప్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీస్ LLC, క్యాపిటల్ ట్యాప్ జనరల్ ట్రేడింగ్ LLC, క్రియేటివ్ పైథాన్ LLC, అల్ జుమోరౌడ్, అల్ యాకూత్ గోల్డ్ & జ్యువెలర్స్ LLC, అల్ జిల్ అల్ ఖాదెమ్ జనరల్ ట్రేడింగ్ LLC, హారిజన్ అడ్వాన్స్డ్ సొల్యూషన్స్ జనరల్ ట్రేడింగ్ LLC ఉన్నాయి.
ఆంక్షల తర్వాత, యూఏఈ ఈ సంస్థలు వాటి సంబంధిత వ్యక్తులపై తన స్వంత దర్యాప్తును ప్రారంభించింది. ఈ దర్యాప్తులకు మద్దతుగా అమెరికా అధికారుల నుండి అదనపు సమాచారాన్ని కోరింది. ఏడు సంస్థలలో ఏవీ యూఏఈలో యాక్టివ్ వ్యాపార లైసెన్స్‌ను కలిగి లేవని లేదా అవి ప్రస్తుతం ఎమిరేట్స్ లో పనిచేయడం లేదని న్యాయ మంత్రిత్వ శాఖ నిర్ధారించింది.
తాజా వార్తలు
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'