గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండించిన ఒమన్..!!
- April 05, 2025
మస్కట్: గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దురాక్రమణను ఒమన్ ఖండించింది. గాజా నగరంలోని ఈశాన్య తుఫా జిల్లాలోని దార్ అల్-అర్కామ్ స్కూల్‌తో అనుబంధంగా ఉన్న షెల్టర్ సెంటర్ పై బాంబు దాడులకు పాల్పడింది. సౌదీ సెంటర్ ఫర్ కల్చర్ అండ్ హెరిటేజ్‌కు చెందిన వైద్య, సహాయ సామాగ్రి కోసం ఒక గిడ్డంగి ధ్వంసమైంది. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దళాలు కొనసాగిస్తున్న దురాక్రమణను, అమాయక పౌరులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడాన్ని ఒమన్ సుల్తానేట్ ఖండించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. గాజాలో కొనసాగుతున్న తీవ్రమైన ఉల్లంఘనలను ఆపడానికి ప్రపంచ దేశాలు కలిసి రావాలని, పాలస్తీనా ప్రజలకు వారి భూములను ఇజ్రాయెల్ తిరిగి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఒమన్ సుల్తానేట్ కోరింది. తూర్పు జెరూసలేం రాజధానిగా స్వతంత్ర రాజ్యాన్ని స్థాపనకు సహకరించడం ద్వారా ఈ సమస్యకు శాశ్వాత పరిష్కారం చూపాలని ఐక్యరాజ్య మండలిని కోరింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?