దేశ నాయకులు ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు..
- July 06, 2016
రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. నెలరోజులపాటు జరిపే ప్రార్థనలు, దైవాశీస్సులు, క్షమార్పణల సమాహారమే రంజాన్ పర్వదినమని ప్రణబ్ తన రంజన్ సందేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మనమంతా మానవాళి సేవకు పునరంకితం కావాలని, మన సంతోషాన్ని పేదలతో, ఆర్తులతో పంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధాని దేశ ప్రజలతోపాటుగా పలుదేశాల అధినేతలకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ శాంతి సామరస్యాల స్ఫూర్తిని మరింతగా పెంచాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. పాక్ ప్రధాని నవాజ్‌షరీఫ్‌తో సహా పలువురు ముస్లిం దేశాల నేతలు, పాలకులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సౌదీరాజు సల్మాన్, అబూధాబీ యువరాజు అల్‌నహయాన్, ఖతార్ అమీర్ థానీ తదితరులకు పండుగ గ్రీటింగ్స్ చెప్పినట్టు మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇరాన్ అధ్యక్షుడు రూహానీ, ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్‌గనీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనా, మాల్దీవ్స్ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌లకు పోన్ చేసి గ్రీటింగ్స్ చెప్పినట్టు ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







