రంజాన్‌ పర్వదినాన్ని ఘనంగా జరుపుకొంటున్నారు..

- July 06, 2016 , by Maagulf
రంజాన్‌ పర్వదినాన్ని ఘనంగా జరుపుకొంటున్నారు..

తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం సోదరులు రంజాన్‌ పర్వదినాన్ని ఘనంగా జరుపుకొంటున్నారు. అల్లా ఆదేశానుసారం నెలరోజులపాటు నిష్ఠతో కొనసాగించిన కఠిన ఉపవాస దీక్షలను విరమించారు. ప్రతి ఒక్కరూ నూతన వస్త్రాలు ధరించి.. మసీదులు, ఈద్గాల వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. సామూహిక ప్రార్థనలతో భాగ్యనగరంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. చార్మినార్‌, మక్కామసీదు, మీర్‌ ఆలం ఈద్గా తదితర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు ట్రాఫిక్‌ దారి మళ్లించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com