తెలంగాణ: మంత్రులను టెన్షన్ పెడుతున్న క్యాబినెట్ విస్తరణ అంశం..

- April 07, 2025 , by Maagulf
తెలంగాణ: మంత్రులను టెన్షన్ పెడుతున్న క్యాబినెట్ విస్తరణ అంశం..

హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణ ప్రాసెస్ క్లైమాక్స్ కు చేరుతుంటే ఆశావహులతో పాటు మంత్రులు కూడా టెన్షన్ పడుతున్నారట. అసలు క్యాబినెట్ లో చోటు దక్కుతుందా లేదా అని ఆశావహులు అయోమయంలో ఉంటే, శాఖలు మారిపోయాయంటూ మంత్రులు ఫీల్ అవుతున్నారట. శాఖల మార్పు నిర్ణయం వల్లే క్యాబినెట్ విస్తరణ ఆలస్యం అవుతోందనే గాసిప్స్ గాంధీభవన్ లో రీసౌండ్ చేస్తున్నాయి. దీంతో తమ శాఖ ఉంటుందా ఉండదా అనే భయం మంత్రుల్లో కనిపిస్తోందనే ప్రచారం జోరందుకుంది.

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ థ్రిల్లర్ సినిమాను మించిన సస్పెన్స్ ను క్రియేట్ చేసింది. ఇదిగో లిస్ట్, అదిగో ముహూర్తం అంటూ ఊరిస్తున్నారు తప్ప.. ఇప్పటివరకు పదవులు పంచింది లేదు. ఏప్రిల్ 3న విస్తరణ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నా వర్కౌట్ కాలేదు. ఈసారి క్యాబినెట్ విస్తరణకు తుది కసరత్తు జరుగుతోందని, మంత్రివర్గంలో భారీ మార్పులు తప్పవనే ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం ఉన్న అమాత్యుల్లో ఎవరి శాఖలు మారబోతున్నాయి? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

పలువురు మంత్రులు వ్యవహరిస్తున్న తీరు పై తీవ్ర విమర్శలు వస్తున్నాయని తెలుస్తోంది. సచివాలయంలోనే ఓ శాఖా మంత్రి ఛాంబర్ ఎదుట కాంట్రాక్టర్లు ఆందోళనలు కూడా చేశారట. ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ పెద్దలు గుర్రుగా ఉన్నారని గాంధీభవన్ లో చర్చించుకుంటున్నారు. మొన్న ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కొందరు మంత్రుల శాఖలను మార్చాలనే అభిప్రాయాన్ని హైకమాండ్ ముందు ఉంచారని తెలుస్తోంది. దీంతో మంత్రివర్గంలో తీసివేతలు తప్పవని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com