ఈద్ అల్ అధా పబ్లిక్ సెలవులను మినీ వెకేషన్‌గా ఎలా మార్చుకోవాలి?
- April 08, 2025
యూఏఈ: జూన్‌లో ఈద్ అల్ అధా సందర్భంగా యూఏఈ నివాసితులు మరో లాంగ్ వీకెండ్ ను పొందనున్నారు. రాబోయే డౌన్‌టైమ్‌ను ఎలా సద్వినియోగం చేసుకోవాలో చాలా మంది ఇప్పటికే ప్రణాళిక వేస్తున్నారు. "నేను జూన్‌లో యూఏఈ నుండి 14 గంటల విమాన ప్రయాణం చేసే దేశానికి ప్రయాణించాలని అనుకుంటున్నాను.జూన్‌లో ఈద్ అల్ అధా వస్తుంది. ఈద్ సెలవులను నా వార్షిక సెలవులతో కలిపి లాంగ్ లీవు నుండి ఎక్కువ ప్రయోజనం పొందడానికి ఇది మంచి అవకాశం అని నేను భావిస్తున్నా." అని 22 ఏళ్ల హింద్ హసన్ అన్నారు.
అబుదాబి నివాసి మాట్లాడుతూ.."మేము ఇక్కడ యూఏఈలో ఈద్ అల్ ఫితర్‌ను జరుపుకున్నాము, కానీ మేము తదుపరి ఈద్ కోసం కాశ్మీర్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాము. మేము జూన్ 4న విమానంలో బయలుదేరి, నా సోదరి వివాహానికి అక్కడే ఉంటాము. నా కొడుకు రెండు పాఠశాల రోజులను కోల్పోతాడు. అయినప్పటికీ మధ్యలో ప్రభుత్వ సెలవులు ఉన్నందున అది పెద్దగా అంతరాయం కలిగించదు." అని పేర్కొన్నాడు.
36 ఏళ్ల ప్రవాస మహిళ హయా బస్సమ్ మాట్లాడుతూ.. జూన్ 15న అదనంగా ఐదు రోజుల సెలవు తీసుకుని తన భర్తతో కలిసి హజ్ కోసం సౌదీ అరేబియాకు వెళ్లనున్నట్లు తెలిపింది.
ఇస్లాంలో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడే అరఫా దినోత్సవం. ఇది ధుల్ హిజ్జా 9న వస్తుంది. యూఏఈలో సెలవుదినం. దీని తర్వాత ఇస్లామిక్ పండుగ ఈద్ అల్ అధా (దుల్ హిజ్జా 10-12) కోసం మూడు రోజులపాటు సెలవులు రానున్నాయి. రెండు సెలవులు కలిపి 4 రోజుల వీకెండ్ ను అందించనుంది.
ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం, అరఫా దినోత్సవం జూన్ 5 వస్తుందని భావిస్తున్నారు. అప్పుడు ఈద్ అల్ అధా సెలవు జూన్ 6 నుండి జూన్ 8 వరకు ఉంటుంది. జూన్ 2 నుండి జూన్ 4 వరకు వార్షిక సెలవులతో కలిపి జూన్ 9 తిరిగి విధుల్లో చేరేనాటికి ముందు 9 రోజుల లాంగ్ వీకెండ్ ను ఆస్వాదించేందుకు అవకాశం ఉంటుంది.మరో విధంగా చూస్తే.. జూన్ 2 నుండి 4 వరకు, జూన్ 9 నుండి 13 వరకు అదనపు సెలవు తీసుకోవడం ద్వారా మొత్తంగా 16 రోజుల మినీ సెలవుగా మార్చుకోవచ్చు. వారాంతాలు, పండుగ సెలవులతో కలుపుకుంటే 16 రోజులపాటు విహారయాత్రకు ఎంచక్కా ప్లాన్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..