స్పేస్‌క్రాఫ్ట్‌ ద్వారా వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు

- July 07, 2016 , by Maagulf
స్పేస్‌క్రాఫ్ట్‌ ద్వారా వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు

ముగ్గురు వ్యోమగాములు ఇవాళ సురక్షితంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్‌ఎస్‌)కి చేరుకున్నారు. ఈరోజు ఉదయం రష్యాలోని బైకోనుర్‌ కాస్మోడ్రోమ్‌ కేంద్రం నుంచి అప్‌గ్రేడెడ్‌ సోయూజ్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ ద్వారా వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. ముగ్గురు వ్యోమగాముల్లో మొదటిసారి అంతరిక్షంలోకి వెళ్తున్న అమెరికాకు చెందిన వ్యోమగామి కాథ్లీన్‌ రుబిన్‌ ఉన్నారు. జపాన్‌కు చెందిన టకుయా ఓనిషి, రస్యాకు చెందిన అనటోలీ ఇవానిషిన్‌లతో కలిసి రుబిన్‌ అంతరిక్ష యాత్రకు వెళ్లారు. ఈ ముగ్గురు నాలుగు నెలలపాటు ఐఎస్‌ఎస్‌లో ఉండనున్నారు. ముగ్గురూ సురక్షితంగా ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com