సరికొత్త ఆధార్ యాప్ వచ్చేసింది..

- April 09, 2025 , by Maagulf
సరికొత్త ఆధార్ యాప్ వచ్చేసింది..

న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆధార్ మొబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ను మంగళవారం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆవిష్కరించారు. ఆధార్ వివరాలను డిజిటల్ గా పంచుకునే ప్రక్రియను సులభతరం చేయడంతోపాటు, ఆధార్ గోప్యతను పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ఈ కొత్త ఆధార్ ధృవీకరణ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ‘ఎక్స్’ వేదికగా ఈ సరికొత్త ఆధార్ యాప్ ఫీచర్ల గురించి వివరించారు. క్యూఆర్ కోడ్ తో తక్షణ వెరిఫికేషన్, రియల్ టైం ముఖ ధ్రువీకరణ (Face ID authentication) వంటి ఫీచర్లు ఈ యాప్ లో ఉంటాయి. ఆధార్ తనిఖీ క్యూఆర్ కోడ్ ను ఆధార్ యాప్ తో స్కాన్ చేస్తే మన ధ్రువీకరణ అయిపోతుంది. ఇప్పుడు యూపీఐ చెల్లింపుకోసం క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసినట్లే ఇదీ పూర్తవుతుంది. పూర్తి సురక్షితంగా, అత్యంత సులువుగా ఆధార్ తనిఖీ జరుగుతుందని వైష్ణవ్ పోస్టు చేశారు.

 

కొత్త ఆధార్ యాప్ మన ఫోన్లో ఉంటే ఆధార్ కార్డు లేదా ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను జేబులో పెట్టుకోవాల్సిన పనిఉండదు. హోటళ్ళు, రిటైల్ దుకాణాలు, విమానాశ్రయాలు, ఇతర పబ్లిక్ చెక్‌పోస్టులలో సాధారణంగా ఆధార్ జిరాక్స్ కాపీలను అందజేయాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చే ఆధార్ యాప్ ద్వారా అలాంటి పరిస్థితి ఉండదు. మన ఫేస్ ఐడీ ద్వారా మన ఆధార్ వివరాలను నమోదు చేస్తుంది. ప్రస్తుతం ఈ యాప్ బీటా వెర్షన్ టెస్టింగ్ దశలో ఉంది. ఫేస్ ఐడీ ప్రామాణికంగా ఒరిజనల్ కార్డులు, ఆధార్ జిరాక్స్ కాపీలతో ఎలాంటి అవసరం లేకుండా ఈ యాప్ చేస్తుందని కేంద్ర మంత్రి వైష్ణవ్ వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com