సౌదీ అరేబియాలో ఈ-స్పోర్ట్స్ వృద్ధి..ప్లేయర్లలో 20% మహిళలు..!!

- April 09, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో ఈ-స్పోర్ట్స్ వృద్ధి..ప్లేయర్లలో 20% మహిళలు..!!

రియాద్ : సౌదీ అరేబియాలో ఈ-గేమింగ్ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. 21 మిలియన్లకు పైగా ఆటగాళ్లతో, ఈ రంగం 2023లో $1.13 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2026 నాటికి 6% CAGRతో $13.6 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. సౌదీ అరేబియా గేమింగ్ ఇండస్ట్రీ 2025 నివేదిక ప్రకారం.. వీడియో గేమింగ్ రంగం 2030 నాటికి GDPకి $13 బిలియన్లను అందిస్తుందని నివేదికలో పేర్కొన్నారు. సౌదీ మార్కెట్లో వీడియో గేమ్ పరిశ్రమ వృద్ధి కారణంగా సుమారు 39,000 కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా వేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com