కువైట్ రోడ్లపైకి కొత్త మొబైల్ స్పీడ్ కెమెరాలు..!!

- April 10, 2025 , by Maagulf
కువైట్ రోడ్లపైకి కొత్త మొబైల్ స్పీడ్ కెమెరాలు..!!

కువైట్: రహదారి భద్రతను మెరుగుపరచడానికి కువైట్‌లోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మొబైల్ స్పీడ్ కెమెరాలను ప్రవేశపెట్టింది. వేగంగా ప్రయాణించే డ్రైవర్లను పర్యవేక్షించడానికి ఈ బ్యాటరీతో నడిచే పరికరాలు వివిధ ప్రదేశాలలో ఏర్పాటు చేయనున్నారు.  "ఫోన్ లేకుండా డ్రైవింగ్ చేయడం" అనే థీమ్‌తో జరిగిన 38వ GCC ట్రాఫిక్ వీక్ సందర్భంగా ఈ చర్యను ప్రకటించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించడం,  వేగ పరిమితులను మరింత సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యమని మేజర్ జనరల్ యూసఫ్ అల్-ఖడ్డా అన్నారు.

ఈ కొత్త కెమెరా బ్యాటరీతో నడుస్తోంది. విద్యుత్ వైరింగ్ అవసరం లేదు. అందువల్ల వివిధ ప్రదేశాలకు రవాణా చేయడం సులభం. ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఈ కెమెరాలు పని ప్రారంభించాయి.   గత సంవత్సరంతో పోలిస్తే ట్రాఫిక్ ఉల్లంఘనలు గణనీయంగా తగ్గాయని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో, సీట్ బెల్ట్ ధరించనందుకు 70,708 ఉల్లంఘనలు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించినందుకు 30,190 ఉల్లంఘనలను విభాగం నమోదు చేసింది.

2024 మరియు 2025 మొదటి త్రైమాసిక గణాంకాలతో పోలిస్తే, రెడ్ లైట్ ఉల్లంఘనల సంఖ్య 55 శాతం తగ్గగా, అతివేగంగా వాహనాలు నడుపుతున్న ఉల్లంఘనల సంఖ్య 43 శాతం తగ్గింది. ఏప్రిల్ 22 నుండి కొత్త ట్రాఫిక్ చట్టం ప్రవేశపెట్టడంతో నేర రకాన్ని బట్టి అధిక జరిమానాలు, జైలు శిక్ష లేదా రెండూ ఒకేసారి విధించే అవకాశం ఉంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com