కువైట్ లేబర్ మార్కెట్లో భారతీయులదే అగ్రస్థానం..!!
- October 22, 2025
కువైట్: జూన్ 2025 చివరి నాటికి కువైట్లో డొమెస్టిక్ వర్కర్స్ మినహా మొత్తం కార్మికుల సంఖ్య 2.229 మిలియన్లకు చేరుకుంది. ఈ మేరకు తాజా లేబర్ మార్కెట్ డేటా వెల్లడించింది. వీరిలో 1.78 మిలియన్ల మంది ప్రవాసులు ఉండగా, 4 లక్షల 48వేల 900 మంది కువైట్ పౌరులు ఉన్నారు.
కువైట్ లేబర్ మార్కెట్లో భారతీయ జాతీయులు అగ్రస్థానంలో ఉన్నారు. మొత్తం వర్క్ పోర్సులో 25.9% శాతానికి సమానమైన 5 లక్షల 78వేల 240 మంది కార్మికులు ఉన్నారు. గతేడితో పోలిస్తే 4,375 మంది కొత్తగా వచ్చి చేరారు. ఇక ఈజిప్షియన్లు 4 లక్షల 69వేల370 మంది కార్మికులతో రెండవ స్థానంలో ఉండగా, కువైట్ పౌరులు 4 లక్షల 48వేల 900 మంది కార్మికులతో మూడవ స్థానంలో ఉన్నారు.
కువైట్ వర్కర్లలో 73.1% మంది ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నారు. వీరి సంఖ్య 3 లక్షల 27 వేల 967 లుగా ఉంది. ఇక 10.2% శాతం మంది, అనగా 45 వేల 860 మంది కువైట్ పౌరులు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారు. కువైట్ పౌరుల సగటు నెలవారీ జీతం KD 1,571కి చేరుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు నెలకు సగటున KD 1,605 సంపాదించగా.. ప్రైవేట్ రంగంలో ఉన్నవారు KD 1,401 సంపాదించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







