నవంబర్ 22న నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రారంభం..!!
- October 22, 2025
యూఏఈ: ఈ సంవత్సరం అబుదాబిలో వింటర్ సీజన్ మరింత ఆకర్షణీయంగా మారనుంది. రెండు మ్యూజియంలు సరికొత్తగా అందుబాటులోకి రానున్నాయి. ఇవి ఎమిరేట్‌కు ఒక ముఖ్యమైన సాంస్కృతిక మైలురాయిగా నిలువనున్నాయి. నవంబర్ 22న సాదియత్ కల్చరల్ డిస్ట్రిక్ట్‌లో నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రారంభమవుతుంది. అదే జిల్లాలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జాయెద్ నేషనల్ మ్యూజియం ప్రారంభ తేదీని డిసెంబర్ 3న ప్రజలకు అందుబాటులోకి రానుంది.
నేచురల్ హిస్టరీ మ్యూజియం 35వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది సందర్శకులను 13.8 బిలియన్ సంవత్సరాల సహజ చరిత్ర - బిగ్ బ్యాంగ్ మరియు మన సౌర వ్యవస్థ ఏర్పడటం నుండి డైనోసార్ల పెరుగుదల మరియు పతనం, భూమి యొక్క జీవవైవిధ్యంతో సహా జీవ పరిణామం వరకు వివరాలను అందజేస్తుంది. ప్రఖ్యాత అర్కెటెక్ట్ మెకానూ దీని డిజైన్ ను రూపొందించారు.
అబుదాబిలోని నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రారంభం ఎమిరేట్ సాంస్కృతిక ప్రకృతి దృశ్యాన్ని రూపొందించే తమ ప్రయాణంలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుందని పర్యాటక శాఖ ఛైర్మన్ మొహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్ అన్నారు. ఈ మ్యూజియం భూమిపై జీవిత కథను అరేబియా లెన్స్ ద్వారా మొదటిసారిగా చూపిస్తుందన్నారు. ఈ ప్రాంతం యొక్క జంతుజాలం, వృక్షజాలం మరియు భౌగోళిక చరిత్రను సందర్శకులకు వివరిస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్
- టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ అధికార నివాసభవనంలో ఘనంగా దీపావళి వేడుకలు
- ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం..
- వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు..
- రియాద్ లో డెమోగ్రఫిక్ సర్వే ప్రారంభం..!!
- నవంబర్ 22న నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రారంభం..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ఒమన్‌లో 56.8% పెరిగిన కార్డియాక్ పరికరాల దిగుమతులు..!!
- కువైట్ లేబర్ మార్కెట్లో భారతీయులదే అగ్రస్థానం..!!
- బహ్రెయిన్ లో ఆసియా యూత్ గేమ్స్ ప్రారంభం..!!