విద్యార్థులను సంస్కృత భాషకు దూరం చేయకూడదు:వెంకయ్యనాయుడు

- April 11, 2025 , by Maagulf
విద్యార్థులను సంస్కృత భాషకు దూరం చేయకూడదు:వెంకయ్యనాయుడు

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ స్థాయిలో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టే యోచన పై మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు తీవ్ర స్పందన తెలిపారు. విద్యార్థులు మంచి మార్కులు సాధించాలనే ఉద్దేశంతో, మాతృభాషలను పక్కన పెట్టడం మంచి అభివృద్ధి కాదని ఆయన ట్వీట్‌ ద్వారా పేర్కొన్నారు. ఇది కేవలం భాషల మధ్య ఎంపిక సమస్య మాత్రమే కాదు, మన సంస్కృతిని, మూలాలను మరచిపోయే ప్రమాదానికి నిదర్శనమని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ స్థాయిలో ద్వితీయ భాషగా సంస్కృతం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందన్న వార్తలు విని విచారించాను. మార్కుల దృష్ట్యా ఈ నిర్ణయం అయితే మాత్రం, పునరాలోచన చేయాలి. విద్యార్థులను మన మాతృభాషకు దూరం చేయడం మంచిది కాదు. సంస్కృతాన్ని బోధించడంలో తప్పులేదు. కానీ అదే సమయంలో మనదైన సంస్కృతిని అందిపుచ్చుకునే దిశగా అమ్మభాష ఆలంబనగా నిలుస్తుంది. ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన తెలుగుభాష ప్రాముఖ్యతను కాపాడాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ స్థాయిలో ద్వితీయ భాషగా సంస్కృతం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందన్న వార్తలు విని విచారించాను. మార్కుల దృష్ట్యా ఈ నిర్ణయం అయితే మాత్రం, పునరాలోచన చేయాలని సూచిస్తున్నాను. విద్యార్థులను మన మాతృభాషకు దూరం చేయడం మంచిది కాదు. సంస్కృతాన్ని బోధించడంలో తప్పు లేదు, అదే సమయంలో మనదైన సంస్కృతిని అందిపుచ్చుకునే దిశగా అమ్మ భాష ఆలంబనగా నిలుస్తుంది. అందుకే జాతీయ విద్యావిధానం- 2020 సైతం మాతృభాషకు ప్రాధాన్యత ఇచ్చింది. ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకుని, విద్యార్థులను మాతృభాషకు మరింత చేరువ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.’ అని వెంకయ్యనాయుడు ట్వీట్‌ చేశారు.

 

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com