ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- February 28, 2026
కువైట్ సిటీ: పవిత్ర రమదాన్ మాసంలో మహమ్మదీయసోదరులు ఎంతో నిష్టతో ఉండే ఉపవాస దీక్షల సందర్భంగా ఇఫ్తార్ విందును కుదరవల్లి సుధాకర రావు ఆధ్వర్యంలో మద్దిన ఈశ్వర్ నాయుడు అధ్యక్షతన కంచన రెడ్డి శేఖర్ మరియు పటాన్ ఖాదర్ ఖాన్ లు ఏర్పాటు చేశారు. ఫర్వానియా ప్రాంతంలో ఉన్న ఒమేరియా పార్కులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కువైట్‌లోని పలు ప్రాంతాల నుండి వందల సంఖ్యలో తెలుగుదేశం మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా సుధాకర రావు మాట్లాడుతూ కార్యక్రమానికి విచ్చేసిన మహమ్మదీయ సోదరులకు రమదాన్ మాస శుభాకాంక్షలు తెలియచేశారు.రమదాన్ మాసం అందరిలోను క్రమశిక్షణ, సహనం, మరియు దైవభక్తిని పెంపొందించే పవిత్ర మాసం.రమదాన్ శాంతి, సోదరభావం అనే సందేశాన్ని మరియు మానవాళికి హితాన్ని బోధిస్తుంది.ఈ నెలలో అందరూ ఇతరుల పట్ల దయ, సానుభూతి, మరియు ప్రేమను ప్రదర్శిస్తారు అని అన్నారు.
అధ్యక్షుడు ఈశ్వర్ నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ మైనార్టీల పక్షపాత పార్టీ అనీ, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పధకాలను మైనార్టీలకోసం ప్రవేశపెట్టారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై టిడిపి గల్ఫ్ ఎంపవర్మెంట్ కో-ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర రావు, ఎన్నరై టిడిపి కువైట్ అధ్యక్షుడు మద్దిన ఈశ్వర్ నాయుడు, ఎన్నారై టిడిపి సీనియర్ నాయకులు మాలేపాటి సురేష్ బాబు నాయుడు, సుగవాసి యువసేన అధ్యక్షుడు కంచన రెడ్డి శేఖర్, ఎన్నరై టిడిపి మైనార్టీ నాయకుదు పటాన్ ఖాదర్ ఖాన్, కొల్లి ఆంజనేయులు, ఖాదరున్, వేణు రాజు,బిల్లా రమేష్, గాజులపల్లి సుబ్బారెడ్డి, తిరుపతి రాజు, జిలాని బాషా, సుబ్బు, మహేష్ కోడూరి, చిన్నా రాజు, గల్ఫ్ జనసేన నాయకులు గల్ఫ్ జాతీయ కన్వీనర్ కంచన శ్రీకాంత్, కువైట్ కన్వీనర్ ఆంజన కుమార్ పగడాల,ఆకుల రాజేష్, కువైట్ కో-కన్వీనర్స్ జగిలి ఓబులేష్,ఆలి షేక్,ఇమ్మిడిసెట్టి సూర్యనారయణ, ప్రేం రాయల్, చంద్రశెఖర్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







