12 గంటల్లో 8 మంది ప్రాణాలను కాపాడిన సౌదీ ఆర్గాన్ సెంటర్..!!
- April 11, 2025
రియాద్ : సౌదీ సెంటర్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (SCOT) 12 గంటల్లోనే ఎనిమిది మందిని కాపాడింది. నలుగురు బ్రెయిన్ డెడ్ దాతల నుండి అవయవాలను విజయవంతంగా సేకరించి, ఎనిమిది మంది రోగుల ప్రాణాలను కాపాడామని అధికారులు తెలిపారు. రెండు గుండె మార్పిడిలు జరుగగా, కాలేయ వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు రెండు కాలేయ మార్పిడిలు జరుగగా, నాలుగు మూత్రపిండ మార్పిడిలు జరిగాయని వెల్లడించారు.
ఈ ఆపరేషన్లలో మదీనాలోని సౌదీ జర్మన్ హాస్పిటల్, కింగ్ సౌద్ మెడికల్ సిటీ, రియాద్‌లోని డాక్టర్ సులైమాన్ అల్ హబీబ్ హాస్పిటల్ సహాఫా బ్రాంచ్, అలాగే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) ఆర్గాన్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కింద అబుదాబిలోని షేక్ ఖలీఫా హాస్పిటల్ మధ్య సహకారం ఉంది. SCOT డైరెక్టర్ జనరల్ డాక్టర్ తలాల్ అల్గౌఫీ మాట్లాడుతూ.. అవయవ కేటాయింపు నైతికంగా, వైద్య ప్రాధాన్యత ప్రకారం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా విజయవంతం చేసిన ప్రతిఒక్కరిని అభినందించారు.
తాజా వార్తలు
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం
- టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది
- టీ20 సిరీస్ టీమిండియాదే
- మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!







