ఒమన్‌లో రెండవ టర్మ్ ఇవాల్యుయేషన్ షెడ్యూల్‌లో మార్పులు..!!

- April 11, 2025 , by Maagulf
ఒమన్‌లో రెండవ టర్మ్ ఇవాల్యుయేషన్ షెడ్యూల్‌లో మార్పులు..!!

మస్కట్: 2024/2025 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ ఇవాల్యుయేషన్ వ్యవస్థకు కట్టుబడి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల వార్షిక ఇవాల్యుయేషన్ కాలక్రమంలో మార్పులు చేశారు. ఈ మేరకు మంత్రివర్గ నిర్ణయాన్ని (నం. 82/2025) విద్యా మంత్రిత్వ శాఖ జారీ చేసింది.

తాజా నిర్ణయం ప్రకారం, రెండవ టర్మ్ కోసం ఇవాల్యుయేషన్ కాలం మరియు 1 నుండి 12 తరగతుల విద్యార్థులకు ఏవైనా పునఃపరీక్షలు ఇప్పుడు జూన్ 1న ప్రారంభమై జూలై 10, 2025న ముగుస్తాయి. ఈ సవరించిన షెడ్యూల్ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఇవాల్యుయేషన్ వ్యవస్థను అనుసరించే ప్రైవేట్ పాఠశాలలు, జనరల్ డిప్లొమా విద్యార్థులు, రెండవ సెమిస్టర్ కోసం వయోజన విద్య డిప్లొమా విద్యార్థులకు వర్తిస్తుందని వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com