శ్రీనగర్‌లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్ల పైకి షియా ముస్లింలు
- March 01, 2026
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారన్న వార్త దావానంలా వ్యాపించడంతో జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.ఈ వార్త తెలియగానే నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న షియా ముస్లింలు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చి నిరసనలు చేపట్టారు. తమ ఆధ్యాత్మిక నాయకుడిని కోల్పోవడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ భారీ ప్రదర్శనలు నిర్వహించారు.
శ్రీనగర్ వీధుల్లో అలీ ఖమేనీ చిత్రపటాలను, నిరసనకారులు భారీ ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇరాన్‌పై జరిగిన దాడులను, ఖమేనీ మృతిని తీవ్రంగా ఖండించిన నిరసనకారులు..తమ నాయకుడి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. కొన్ని చోట్ల టైర్లు తగులబెట్టి రోడ్లను దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో జమ్మూకశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







