63 ఇరానియన్ క్షిపణులు, 11 డ్రోన్లను అడ్డుకున్నాము: ఖతార్
- March 01, 2026
దోహా: తమ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన 65 బాలిస్టిక్ క్షిపణులు మరియు 12 డ్రోన్లతో అడ్డుకున్నట్లు ఖతార్ ప్రకటించింది. ఇరాన్ దాడులను ఖతార్ సాయుధ దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయని తెలిపింది. ఈ దాడిలో ఆస్తి నష్టంతోపాటు ఎనిమిది మంది స్వల్పంగా గాయపడ్డారని పేర్కొంది.
అయితే, రెండు క్షిపణులు అల్ ఉదీద్ వైమానిక స్థావరానికి చేరుకున్నాయని, అందులో ఒకటి ముందస్తు హెచ్చరిక రాడార్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు.
మరోవైపు, ఖతార్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో శిథిలాలు పడినట్టు వచ్చిన 114 నివేదికలపై పబ్లిక్ ప్రత్యేక బృందాలు స్పందించాయి తెలిపింది. నివాసితులు ఇంటి లోపలే ఉండాలని, పుకార్లను నమ్మొద్దని, డాదులకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను తీయకుండా ఉండాలని ముందస్తు జాగ్రత్తగా హెచ్చరికలు జారీ చేశారు.
ఈ దాడిని జాతీయ సార్వభౌమత్వాన్ని తీవ్రంగా ఉల్లంఘించడం మరియు ప్రాంతీయ భద్రతకు ముప్పుగా ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. దాడులకు గురైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్ మరియు జోర్డాన్లకు సంఘీభావాన్ని ప్రకటించింది.
డ్రోన్ శిథిలాల ఫలితంగా అబుదాబిలో ఒక పాకిస్తానీ నివాసి మరణించినందుకు దోహా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఇస్లామాబాద్‌లకు తన సంతాపాన్ని తెలియజేసింది. ఈ ప్రాంతంలో తీవ్రమైన పరిణామాలను నివారించడానికి ఉద్రిక్తతను తగ్గించడానికి మరియు దౌత్య పరమైన చర్చలను తిరిగి ప్రారంభించాలని ఖతార్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







