రెండు మూడు సినిమాల్ని హోల్డ్ లో దర్శకులు..
- July 07, 2016
ఏ దర్శకుడైనా ఒక సినిమా పూర్తవగానే మరో సినిమా ట్రాక్ ఎక్కించేస్తాడు. కానీ ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో ఒక సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒక సినిమా ట్రాక్ మీదుండగానే.. రెండు మూడు సినిమాల్ని హోల్డ్ లో పెట్టుకొని ముందుకు సాగుతున్నారు దర్శకులు. ఎక్కువగా పీనియర్ దర్శకులు ఈ విధానాన్ని ఫాలో అవుతున్నారు. అలా రెండు మూడు సినిమాల్ని లైన్ లో ఉంచుకొని జోరు మీదున్న టాలీవుడ్, కోలీవుడ్ దర్శకులపై కథనం..రామ్‌గోపాల్ వర్మ డిక్షనరీలో ఖాళీ అనే పదానికి చోటు లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా వర్మ పర్సనల్ థియేటర్లో ఎప్పుడూ నాలుగైదు సినిమాలు ఆడుతుంటాయి. స్క్రిప్ట్ వర్క్‌లో ఒకటి, సెట్స్‌పై మరొకటి, రిలీజ్‌కి రెడీగా ఉన్నదొకటి, ప్రకటనలకు పరిమితమైన సినిమా ఇంకొకటి! రాంగోపాల్ వర్మ.. వర్మ ఏం చేసినా సంచలనమే. వంగవీటి రంగా జీవితం ఆధారంగా 'వంగవీటి' తీస్తున్నట్టు ప్రకటించారు. ఆయనకు బాగా ఇష్టమైన మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వివేక్ ఒబెరాయ్ టైటిల్ రోల్లో తీసిన 'రాయ్' విడుదలకు సిద్ధమవుతోంది. ఇక, వర్మ దర్శకత్వంలో సచిన్ జోషీ, మీరా చోప్రా జంటగా నటించిన 'మొగలిపువ్వు' ఫస్ట్‌లుక్, ట్రైలర్లు విడుదలై చాలా రోజులైంది. అలాగే రాజశేఖర్‌తో 'పట్టపగలు' అనే హారర్ సినిమా తీశారు. ఈ రెండు చిత్రాల విడుదల ఎప్పుడో ఇంకా ప్రకటించలేదు. సెట్స్ మీద ఇంకా రెండు మూడు సినిమాలు ఉన్నాయని టాక్.కృష్ణవంశీ.. సినిమా హిట్టయితే దర్శకుణ్ణి భేష్ అంటారు. ఫట్టయితే వేస్ట్ అంటారు. కానీ, కృష్ణవంశీ విషయంలో మాత్రం ఇది భిన్నంగా జరుగుతుంది. ఆయన సినిమా ఫట్టయినా.. అందులో మాట్లాడుకోవడానికి నాలుగు మంచి మాటలుంటాయ్. కృష్ణవంశీ క్రియేటివిటీ అలాంటిది. మాములుగా కృష్ణవంశీ సినిమా సినిమాకీ కొంచెం గ్యాప్ తీసుకుంటారు. కానీ, ఈసారి గేర్ రివర్స్‌లో ఉంది. ఆయన కూడా జోరు మీద ఉన్నట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా 'నక్షత్రం' తీస్తున్నారు. ఆ వెంటనే నందమూరి బాలకృష్ణ హీరోగా 'రైతు' సినిమా చేస్తారు. ఇది బాలకృష్ణకు 101వ సినిమా అవుతుంది.పూరి.. లోడ్ చేసిన గన్, పూరి జగన్నాథ్ బ్రెయిన్ ఒక్కటే. సినిమాలో మాటల తూటాలు పేల్చడమే కాదు, ఏడాదికి రెండు మూడు సినిమాలు తీయగల సత్తా ఉన్న దర్శకుడు. ప్రస్తుతం 'మహాత్మ' చిత్ర నిర్మాత సీఆర్ మనోహర్ తనయుడు ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తున్న 'రోగ్' చిత్రీకరణ పూర్తి చేశారు పూరి వెంటనే నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా 'ఇజం' మొదలుపెట్టేశారు. ఇది పూర్తయిన వెంటనే ఎన్టీఆర్‌తో సినిమా ప్రారంభిస్తారు. ఇటీవలే కథ కూడా వినిపించారు. నందమూరి బ్రదర్స్ తర్వాత మహేష్‌బాబుతో ముచ్చటగా మూడో సినిమా చేయనున్నట్లు టాక్. దానికి 'జన గణ మణ' అనే టైటిల్ కూడా ప్రకటించారు. ఎప్పటిలానే పూరి జోరు మీద ఉన్నారు.గౌతమ్ మీనన్.. గౌతమ్ మీనన్‌ది కూడా వర్మ స్టైలే. ఓ సినిమా షూటింగ్‌కి ఎండ్ కార్డ్ వేయకముందే మరో సినిమాకి క్లాప్ బోర్డ్ రెడీ చేసేస్తారు. అజిత్‌తో తీసిన 'ఎన్నై అరిందాల్' విడుదలకు సిద్ధమైన సమయంలోనే నాగ చైతన్యతో 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ప్రారంభించారు. ఈ కథనే తమిళంలో శింబు హీరోగా తీశారు. త్వరలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మధ్యలో ఈ సినిమా షూటింగ్ లేట్ కావడంతో తమిళ చిత్రం 'ఎన్నై నోక్కి పాయుమ్ తోట్టా' కథ సిద్ధం చేశారు. ఇందులో ధనుష్ హీరో. రానా దగ్గుబాటి కీలక పాత్రధారి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా తర్వాత తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఓ భారీ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు హీరో సాయిధరమ్ తేజ్, తమిళ హీరో 'జయం' రవి, కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్, మలయాళ హీరో పృథ్వీరాజ్‌లతో ఈ మల్టీస్టారర్ మూవీ తీయాలనుకుంటున్నారట. అనుష్క, తమన్నాలను కథానాయికలుగా అనుకుంటున్నారని టాక్. సో... గౌతమ్ మీనన్ కూడా ఫుల్ బిజీ.కొరటాల శివ.. కమర్షియల్ కథలకు సందేశాత్మక సొబగులు అద్ది సినిమా తీయడం దర్శకుడు కొరటాల శివ స్పెషాలిటీ. స్వతహాగా రచయిత కావడంతో 'మిర్చి', 'శ్రీమంతుడు' సినిమాల్లో హీరోయిజం, సందేశం, వినోదం, భావోద్వేగాలు అన్నిటినీ మేళవించి ప్రేక్షకులకు విందు భోజనం పెట్టారు. ప్రస్తుతం ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్'కి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేస్తారు. 'శ్రీమంతుడు' కంటే ముందే చరణ్ హీరోగా బండ్ల గణేశ్ నిర్మాణంలో కొరటాల ఓ సినిమా చేయాల్సింది. ప్రారంభోత్సవం జరిగిన తర్వాత ఆ సినిమా ఆగింది. మళ్లీ ఈ కాంబినేషన్ కుదిరింది. మొత్తం మీద ఒక సినిమా తర్వాత మరొకటి చేస్తూ, గ్యాప్ లేకుండా చూసుకుంటున్నారు కొరటాల శివ.మురుగుదాస్.. విభిన్న కథాంశాలతో మంచి మాస్ మూవీస్ తీసే సత్తా ఉన్న దర్శకుడు మురుగదాస్. ఆయన తీసే అన్ని చిత్రాల కథలూ డిఫరెంట్‌గా ఊంటాయి. మరి.. ఎప్పుడు ఖాళీ దొరుకుతుందో కానీ, ఒక సినిమా చేసేటప్పుడే మరో డిఫరెంట్ స్టోరీ రెడీ చేసేస్తాడు. హిందీలో సోనాక్షీ సిన్హా కథానాయికగా 'అకిరా' సినిమా చేశాడు మురుగదాస్. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తదుపరి చిత్రంపై దృష్టి పెట్టాడు. మహేశ్‌బాబు హీరోగా భారీ నిర్మాణ వ్యయంతో రూపొందే చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్‌తో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. ఈ నెలలోనే ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. ఈ సినిమా ఇంకా స్టార్ట్ కాకుండానే అంచనాల్ని విపరీతంగా పెంచేస్తోంది. డిఫరెంట్ మేకోవర్ లో మహేష్ బాబును ప్రెజెంట్ చేయబోతున్నాడు మురుగదాస్.వీవీ వినాయక్.. చిరంజీవి 150వ చిత్రంతో వీవీ వినాయక్ ఫుల్ బిజీ. ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా, తండ్రితో సినిమా పూర్తయ్యాక వినాయక్ దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేయాలనుకుంటున్నారట. రామ్‌చరణ్ హీరోగా 'ధ్రువ' చిత్రం షూటింగ్లో సురేందర్‌రెడ్డి నిమగ్నమై ఉన్నారు. ఇటీవల నితిన్‌తో త్రివిక్రమ్ 'అఆ' వంటి సూపర్ హిట్ మూవీ ఇచ్చిన విషయం తెలిసిందే. తదుపరి సినిమా పవన్ కల్యాణ్‌తో చేస్తారని వినికిడి. 'సరైనోడు' వంటి భారీ కమర్షియల్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను ప్రస్తుతం బెల్లంకొండ సురేశ్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయనున్నారు. ఒక సినిమా విడుదల కాకుండానే ఆ దర్శకుడి కేలిబర్ ని , కేపబిలిటీని బట్టి ఇంకో రెండు మూడు సినిమాలు ఆటో మెటిగ్గా ట్రాక్ మీదకి వచ్చేస్తాయి. ప్రస్తుతం సీనియర్ దర్శకులు ఈ తరహాలో జోరుమీద దూసుకుపోతున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







