‘హిట్‌-3 ట్రైల‌ర్‌’వచ్చేసింది..

- April 14, 2025 , by Maagulf
‘హిట్‌-3 ట్రైల‌ర్‌’వచ్చేసింది..

నాచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న మూవీ హిట్‌-3. శైల‌ష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. హిట్ ఫ్రాంఛైజీలో వ‌స్తున్న మూడో చిత్రం కావ‌డంతో ఈ చిత్రం పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. శ్రీనిధి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తోండ‌గా మిక్కీ జే మేయ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు. నాని హోం బ్యానర్‌ వాల్‌పోస్టర్‌ సినిమా, యునానిమస్‌ ప్రొడక్షన్స్ పై ప్రశాంతి త్రిపురనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మే 1న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది.

వరుస హత్యలు, అర్జున్‌ వాటిని ఎలా చేధించాడు అనే కోణంలో ఈ సినిమా ఉండ‌నున్న‌ట్లు ట్రైల‌ర్ బ‌ట్టి తెలుస్తోంది. అర్జున్‌ సర్కార్‌గా నాని చెప్పిన డైలాగ్‌లు అదిరిపోయాయి. మొత్తంగా ట్రైల‌ర్ అదిరిపోయింది. సినిమాల పై ఉన్న అంచ‌నాల‌ను అమాంతం పెంచేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com