అబుదాబిలో E311 కనీస వేగ పరిమితి ఎత్తివేత..!!
- April 14, 2025
యూఏఈ: అబుదాబిలో ట్రాఫిక్ భద్రతను పెంచడంతోపాటు భారీ ట్రక్కులకు అనుకూలమైన నిర్ణయం తీసుకున్నారు. సంస్కరణల్లో భాగంగా షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ రోడ్ (E311)లో కనీస వేగ పరిమితి వ్యవస్థను 120kmph ఎత్తివేయనున్నట్లు అబుదాబి ప్రకటించింది. ఇకపై వాహనదారులు 120kmph కనీస వేగానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని అబుదాబి ప్రకటించింది.ఈ మార్పు అన్ని వాహనాలకు వర్తిస్తుందని, ముఖ్యంగా పెద్ద వాహనాలతో రద్దీగా ఉండే మార్గంలో ప్రయాణించే వారికి మెరుగైన, సురక్షితమైన డ్రైవింగ్ వాతావరణానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
ఏప్రిల్ 2023లో అబుదాబి E311లో కనీస వేగ పరిమితిని 120kmphగా నిర్ణయించారు. ఈ ప్రధాన రహదారిపై గరిష్ట వేగం 140kmph, ఎడమ నుండి మొదటి, రెండవ లేన్లలో కనిష్ట వేగం 120kmphగా ఉంది. కనీస వేగ పరిమితిని ఉల్లంఘించిన డ్రైవర్లకు జరిమానా కింద Dh400 జరిమానా విధించబడుతుంది. అలాగే నెమ్మదిగా డ్రైవింగ్ చేసినా జరిమానా విధిస్తారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్