కేదార్‌నాథ్ యాత్ర కోసం IRCTC హెలికాప్టర్ సర్వీసులు..
- April 15, 2025
కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కేదార్‌నాథ్ యాత్ర 2025 కోసం స్పెషల్ హెలికాప్టర్ సర్వీసులను ప్రకటించింది.
వచ్చే మే 2 నుంచి ప్రారంభమై మే 31 వరకు ప్రతిరోజూ హెలికాప్టర్ సర్వీసులను అందించనుంది. ఈ సర్వీసులను కేదార్‌నాథ్ యాత్రికులకు వేగంగా కేదార్‌నాథ్ ఆలయానికి చేర్చేందుకు ఐఆర్‌సీటీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
సురక్షితమైన సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఐఆర్‌సీటీసీ హెలికాప్టర్ సర్వీసులను అందిస్తోంది. మూడు ప్రదేశాల నుంచి హెలికాప్టర్ షటిల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
ఫాటా : రూ. 6,063 (రౌండ్ ట్రిప్)
సిర్సి : రూ. 6,061 (రౌండ్ ట్రిప్)
గుప్త్ కాశి : రూ. 8,533 (రౌండ్ ట్రిప్)
ఈ వాయుమార్గాల్లో హిమాలయాల మీదుగా మీరు ప్రయాణం చేయొచ్చు. ప్రయాణ సమయం తగ్గడమే కాదు.. రైల్వే మార్గంలో వెళ్లే విధంగా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.
యాత్రకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి, బుకింగ్ ప్రక్రియ ఇలా:
- హెలికాప్టర్ టిక్కెట్లు బుక్ చేసుకునే ముందు యాత్రికులు అధికారిక ఉత్తరాఖండ్ టూరిజం వెబ్‌సైట్ ద్వారా కేదార్‌నాథ్ యాత్రకు తప్పనిసరి రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయాలి.
- కొత్త వినియోగదారులు ఒక అకౌంట్ మాత్రమే క్రియేట్ చేసుకోవాలి.
- ప్రయాణ వ్యవధి, ప్రయాణికుల సంఖ్య, ప్రయాణ తేదీలు వంటి ప్రయాణ వివరాలను అందించాలి.
- ఆపై యాత్ర రిజిస్ట్రేషన్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- హెలియాత్ర పోర్టల్‌లో హెలికాప్టర్ టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఈ రిజిస్ట్రేషన్ లెటర్ చాలా అవసరం.
- ముందుగా హెలియాత్ర పోర్టల్‌లో వారి మొబైల్ నంబర్, ఇమెయిల్ అడ్రస్ ఉపయోగించి రిజిస్ట్రర్ చేసుకోవాలి.
- OTP వెరిఫై చేసిన తర్వాత లాగిన్ అవ్వాలి.
- యాత్ర రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేసి, ప్రయాణ తేదీలు, ప్రాధాన్య సమయ స్లాట్‌లు, ప్రయాణీకుల సంఖ్యను ఎంచుకుని పేమెంట్ పూర్తి చేయవచ్చు.
- ప్రతి యూజర్ రెండు టిక్కెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు.
- ప్రతి టికెట్‌లో గరిష్టంగా 6 ప్రయాణికులకు వసతి కల్పించవచ్చు.
- క్యాన్సిల్, రీఫండ్ ప్రాసెస్ ఇలా :
- ఒకవేళ మీ ప్లానింగ్ మారితే.. ప్రయాణికులు తమ బుకింగ్‌ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిలేషన్ ఛార్జీలు వర్తిస్తాయి. ఆ తర్వాత 5 నుంచి 7 వర్కింగ్ డేస్‌లో మీ డబ్బు రీఫండ్ అవుతుంది. అయితే, షెడ్యూల్ అయి బయలుదేరే 24 గంటలలోపు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఎలాంటి రీఫండ్ ఉండదని గమనించాలి.
ఈ సర్వీసులకు హై డిమాండ్ ఉన్నందున, యాత్రికులు తమకు ఇష్టమైన ప్రయాణ తేదీలు, సమయాలను ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. తక్కువ సమయంలోనే అత్యంత సౌకర్యవంతమైన కేదార్‌నాథ్ యాత్రను పూర్తి చేయొచ్చు.
తాజా వార్తలు
- గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య!
- కువైట్ లో ది లీడర్స్ కాన్క్లేవ్..!!
- సౌదీలో 23,094 మంది అరెస్టు..!!
- బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!
- బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- ROHM లో స్టార్ డయానా హద్దాద్ కాన్సర్ట్..!!
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష