ఎన్ఐఏ కస్టడీలో ఉన్న ఐసిస్ సానుభూతిపరులతో కుటుంబసభ్యులు
- July 07, 2016
నగరంలో దాడులకు కుట్ర పన్ని పట్టుబడ్డ ఐసిస్ సానుభూతిపరులకు.. రంజాన్ సందర్భంగా వారి కుటుంబసభ్యులను కలుసుకునే అవకాశం కల్పించారు. నాంపల్లి కోర్టు అనుమతితో ప్రస్తుతం ఐదుగురు ఐసిస్ సానుభూతిపరులు ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. రంజాన్ సందర్భంగా గురువారం విచారణను తాత్కాలికంగా నిలిపివేశారు. యువకులకు చెందిన కుటుంబసభ్యులు ఇద్దరేసి వంతున కలిసేందుకు అనుమతి ఇచ్చారు. రంజాన్ కావడంతో ఆ యువకుల మనోభావాలను గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. అయితే కుటుంబసభ్యులు తీసుకొచ్చిన ఆహార పదార్థాలను మాత్రం అనుమతించలేదు. యువకులు కోరిన ఆహార పదార్ధాలను తామే తయారుచేయించినట్లు తెలిపారు. శుక్రవారం నుంచి వారి విచారణ యథాతథంగా జరుగుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







