ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్న ఐసిస్‌ సానుభూతిపరులతో కుటుంబసభ్యులు

- July 07, 2016 , by Maagulf
ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్న ఐసిస్‌ సానుభూతిపరులతో కుటుంబసభ్యులు

నగరంలో దాడులకు కుట్ర పన్ని పట్టుబడ్డ ఐసిస్‌ సానుభూతిపరులకు.. రంజాన్‌ సందర్భంగా వారి కుటుంబసభ్యులను కలుసుకునే అవకాశం కల్పించారు. నాంపల్లి కోర్టు అనుమతితో ప్రస్తుతం ఐదుగురు ఐసిస్‌ సానుభూతిపరులు ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్నారు. రంజాన్‌ సందర్భంగా గురువారం విచారణను తాత్కాలికంగా నిలిపివేశారు. యువకులకు చెందిన కుటుంబసభ్యులు ఇద్దరేసి వంతున కలిసేందుకు అనుమతి ఇచ్చారు. రంజాన్‌ కావడంతో ఆ యువకుల మనోభావాలను గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. అయితే కుటుంబసభ్యులు తీసుకొచ్చిన ఆహార పదార్థాలను మాత్రం అనుమతించలేదు. యువకులు కోరిన ఆహార పదార్ధాలను తామే తయారుచేయించినట్లు తెలిపారు. శుక్రవారం నుంచి వారి విచారణ యథాతథంగా జరుగుతుందని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com