ఫ్యూచర్ సిటీలో మారుబెనీ కంపెనీ రూ. వెయ్యి కోట్లు పెట్టుబడులు..
- April 18, 2025
హైదరాబాద్: తెంలగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా పెద్దమొత్తంలో రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జపాన్ కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.
టోక్యోలో మారుబెనీ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇండస్ట్రీయల్ పార్క్ ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. దాదాపు రూ. వెయ్యి కోట్ల ప్రారంభ పెట్టుబడితో మారుబెనీ కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఫ్యూచర్ సిటీలో దశల వారీగా ఆరు వందల ఎకరాల్లో ప్రపంచ స్థాయి నెక్ట్స్ జనరేషన్ ఇండస్ట్రీయల్ పార్క్ ను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసుకుంది. ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు.
మారుబెనీ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా 65దేశాల్లో 410కిపైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. జపాన్ కంపెనీలతో పాటు ఇతర మల్టీ నేషనల్ కంపెనీలు హైదరాబాద్లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా నెక్స్ట్ జనరేషన్ ఇండ స్ట్రియల్ పార్క్ ను అభివృద్ధి చేస్తారు. దీంతో దాదాపు రూ. 5,000 కోట్లకు పైగా పెట్టుబడును ఆకర్షించే చాన్స్ ఉంది. మారుబేని ఇండస్ట్రియల్ పార్క్ ప్రధా నంగా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై దృష్టి పెడుతుంది. అయితే, అధునాతన తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు నైపుణ్యం కలిగిన ఉపాధి అవకాశాలను సృష్టించాలనే తెలంగాణ లక్ష్యాలకు తగ్గట్టు ఈ ప్రాజెక్టు చేపడతారని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







