వాహన దారులకు ఆబుదాబి పోలీసుల హెచ్చరిక.. ఢీకొన్న వాహనాలు..!!
- April 20, 2025
యూఏఈ: ఆబుదాబి పోలీసులు శనివారం హెచ్చరిక జారీ చేశారు. వాహనదారులు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తమ ఫోన్లను ఉపయోగించవద్దని హెచ్చరించారు. కొన్ని క్షణాల పరధ్యానం కూడా పెద్ద ప్రమాదానికి కారణమవుతుందని అధికార యంత్రాంగం తెలిపింది. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో దీనికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తు పలు కార్లను ఢీకొన్న రెండు సంఘటనలను చూపించారు.
మొదటి సంఘటనలో, ఒక కారు వేగంగా వెళ్లి తన ముందు కాను ఢీకొనగా, అది వెళ్లి దాని ముందున్న కారును బలంగా ఢీకొట్టింది. మరొక సంఘటనలో, ఒక కారు ఒక ప్రధాన రహదారిపై మరొక కారును ఢీకొట్టింది. ప్రమాదానికి కారణమైన వ్యక్తి రోడ్డుపై జారిపడ్డాడు. దాంతో ఆ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయింది.
వాహనదారులు సురక్షితంగా డ్రైవ్ చేయాలని. రహదారి భద్రతా నియమాలను పాటించాలని పోలీసులు ఈ సందర్భంగా సూచించారు. యూఏఈలో ఇది తీవ్రమైన నేరమని, దీనికి 800 దిర్హంల వరకు ఫైన్ పడుతుందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్‌లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్









