మాళవిక నాయర్‌తో మరోసారి నాని!
- July 08, 2016
వరుస హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్న నాని ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యంత ఆదరణ కలిగిన మీడియం చిత్రాల హీరోగా వెలిగిపోతున్నాడు. మంచి సబ్జెక్టుతో నానితో సినిమా తీస్తే అది ఖచ్చితంగా పెట్టుబడికి రెండింతలు దాటేస్తుందని ఇండస్ట్రీ వర్గాలే కాదు.. ట్రేడ్ వర్గాలు కూడా అంటున్నాయి. కాగా విజయాలతో వున్న ఈ హీరోకు మరో సెంటిమెంట్‌ను జోడిస్తున్నారు దర్శక నిర్మాతలు. నాని కనుక తన సినిమాలో మలయాళ ముద్దుగుమ్మలతో నటిస్తే ఆ చిత్రం హిట్టవ్వడం ఖాయం అనేది ఆ సెంటిమెంట్. దీనికి ఉదాహరణగా వారు పలు చిత్రాలను చూపిస్తున్నారు. నాని కెరీర్‌ను టర్న్ చేసిన 'అలా మొదలైంది' చిత్రంలో నాని సరసన నిత్యామీనన్ నటించింది. ఈ చిత్రం పెద్ద హిట్. ఆ తర్వాత ఆయన కెరీర్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చేసిన 'ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్రంలో మాళవిక నాయర్ అనే ముద్దుగుమ్మ నాని సరసన నటించింది. ఈ చిత్రం నానికి మంచి జోష్‌ను ఇచ్చి, ఓవర్సీస్లో కూడా మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక తాజాగా నటించిన 'జెంటిల్మన్' చిత్రంలో నటించిన నివేదా థామస్ కూడా మలయాళీ ముద్దుగుమ్మే. కాగా ప్రస్తుతం నాని 'ఉయ్యాల జంపాల' చిత్ర దర్శకుడు విరించి వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు.
ఈ చిత్రంలో మలయాళీ ముద్దుగుమ్మ ఇమ్మాన్యుయేల్‌ను హీరోయిన్గా తీసుకున్నారు. మరి ఈ చిత్రం కూడా హిట్టయితే నాని సెంటిమెంట్ మరింత బలపడుతుంది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







