చెక్కు ఫోర్జరీ..బాధితుడికి QR2 మిలియన్ పరిహారం..!!
- April 28, 2025
దోహా, ఖతార్: ఖతార్‌లోని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ చెక్ ఫోర్జరీ బాధితుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. గ్యారెంటీ చెక్కును మోసపూరితంగా మార్చిన వారికి జైలు శిక్ష, జరిమానాతోపాటు ప్రయాణ నిషేధం, QR 2 మిలియన్ పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
కేసు వివరాల ప్రకారం,.. బాధితుడు తన మాజీ బిజినెస్ పార్టనర్, స్నేహితుడి వాహనం కొనుగోలుకు QR 162,000 రుణ మొత్తానికి ఫైనాన్సింగ్ కంపెనీకి హామీదారుగా ఉన్నాడు. హామీగా, బాధితుడు తన స్నేహితుడికి ఖాళీ చెక్కును ఇచ్చాడు. అయితే, 10 సంవత్సరాల తరువాత, బాధితుడు తన మాజీ స్నేహితుడు QR 28.5 మిలియన్ల చెక్కు మోసం చేసాడని అరెస్ట్ వారెంట్ జారీ చేయించాడు. అయితే, విచారణ అధికారులు తమ విచారణలో నిజాన్ని తెలుసుకున్నారు. దాంతో కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టెన్స్ మిస్డిమీనర్స్ అండ్ ఫెలోనీస్ 3 సంవత్సరాల జైలు శిక్ష, ప్రయాణ నిషేధం, QR 100,000 ఫైన్ విధించింది. చెక్కులతో లేదా ఏదైనా ఆర్థిక వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలని ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు సూచించింది.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







