ఖైతాన్‌లో భద్రతా తనిఖీలు..13 మంది అరెస్టు..!!

- April 28, 2025 , by Maagulf
ఖైతాన్‌లో భద్రతా తనిఖీలు..13 మంది అరెస్టు..!!

కువైట్: తాత్కాలిక ప్రధాన మంత్రి షేక్ ఫహద్ అల్-యూసఫ్ ఆదేశాలతో ట్రాఫిక్, రెస్క్యూ విభాగం ఖైతాన్ ప్రాంతంలో భద్రతా తనిఖీలు చేపట్టింది. జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్, రెస్క్యూ పోలీస్, సెంట్రల్ ఆపరేషన్స్, పబ్లిక్ సెక్యూరిటీ అఫైర్స్‌తో సహా అనేక విభాగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.

ఈ సందర్భంగా గడువు ముగిసిన నివాస అనుమతులు కలిగిన 13 మంది వ్యక్తులను అరెస్టు చేయడంతోపాటు పోలీసులకు దొరకకుండా తప్పించుకుతిరుగుతున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇద్దరు వ్యక్తులను యాంటీ-నార్కోటిక్స్ విభాగానికి రిఫర్ చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ సమయంలో మొత్తం 184 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com