సిరియా ప్రపంచ బ్యాంకు బకాయిలను చెల్లించిన సౌదీ అరేబియా..!!

- April 28, 2025 , by Maagulf
సిరియా ప్రపంచ బ్యాంకు బకాయిలను చెల్లించిన సౌదీ అరేబియా..!!

రియాద్:  సిరియా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణను వేగవంతం చేసే ప్రయత్నాలలో భాగంగా, సౌదీ అరేబియా- ఖతార్ సంయుక్తంగా ప్రపంచ బ్యాంకు గ్రూపుకు సిరియా బకాయిలను దాదాపు $15 మిలియన్లు చెల్లిస్తున్నట్లు ప్రకటించాయి. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి 2025 సమావేశాల సందర్భంగా సిరియా రౌండ్‌టేబుల్ సందర్భంగా ఈ మేరకు ప్రకటించారు.  ఈ చెల్లింపు 14 సంవత్సరాల విరామం తర్వాత సిరియాలో ప్రపంచ బ్యాంకు తన మద్దతు, కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి మార్గం సుగమం అవుతుందని తెలిపారు. ఇది సిరియాకు అత్యవసర రంగాలకు మద్దతు ఇవ్వడానికి కొత్త కేటాయింపులను పొందేందుకు వీలు కల్పిస్తుందని, సంస్థలను పునర్నిర్మించడం, సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి విధాన పరమైన అభివృద్ధి, సంస్కరణలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పనిచేస్తుందని ప్రకటించారు. 

అంతర్జాతీయ, ప్రాంతీయ ఆర్థిక సంస్థలకు సిరియాలో అభివృద్ధి కార్యకలాపాలను త్వరగా పునఃప్రారంభించి విస్తరించాలని, ప్రాంతీయ స్థిరత్వం కోసం దోహదపడే భవిష్యత్తు కోసం.. సిరియన్ ప్రజల ఆకాంక్షలకు మద్దతు ఇచ్చేందుకు ముందుకురావాలని సౌదీ అరేబియా, ఖతార్ పిలుపునిచ్చాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com