NRI, ట్రావెలర్లకు గుడ్ న్యూస్..
- April 28, 2025
భారతీ ఎయిర్టెల్ అంతర్జాతీయ రోమింగ్ (IR) పోర్ట్‌ఫోలియోకు బిగ్ అప్‌గ్రేడ్‌ను ప్రకటించింది. భారత మొట్టమొదటి అన్లిమిటెడ్ IR ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఎయిర్టెల్ కొత్త ప్లాన్లు ఇప్పుడు 189 దేశాలలో కస్టమర్లు అన్లిమిటెడ్ డేటాను వినియోగించుకోవచ్చు. తరచుగా ట్రావెలింగ్ చేసేవారికి, NRIలకు ఎక్కువ బెనిఫిట్స్ పొందవచ్చు.
ఎన్ఆర్ఐల కోసం స్పెషల్ రూ.4వేలు ప్లాన్:
ఎన్ఆర్ఐ కమ్యూనిటీకి బిగ్ రిలీఫ్.. ఎయిర్టెల్ ఏడాది వ్యాలిడిటీతో రూ. 4వేలు రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కింద వినియోగదారులు 5GB అంతర్జాతీయ రోమింగ్ డేటా, విదేశాలలో 100 వాయిస్ నిమిషాలు పొందవచ్చు. భారత్‌లో ఉన్నప్పుడు, వినియోగదారులు ఒకే నంబర్‌ను ఉపయోగించి అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్‌తో పాటు 1.5GB రోజువారీ డేటాను పొందవచ్చు. స్పెషల్ రీఛార్జ్‌ల అవసరం ఉండదు.
కస్టమర్లకు అందించే బెనిఫిట్స్ ఇవే:
ఎయిర్టెల్ కొత్త IR ప్లాన్లు కస్టమర్-సెంట్రలైజడ్ ఫీచర్లు కలిగి ఉన్నాయి.
ప్రపంచ కవరేజ్: సింగిల్ ప్లాన్ 189 దేశాలలో వినియోగించుకోవచ్చు.
విమానంలో కనెక్టివిటీ: విమానంలో ఉన్నప్పుడు కూడా నెట్వర్క్ పనిచేస్తుంది.
ఆటో యాక్టివేషన్: విదేశాల్లో అడుగుపెట్టిన తర్వాత సర్వీసులు ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతాయి.
ఆటో-రెన్యూవల్: తరచుగా ప్రయాణించే వారికి బెస్ట్. పదేపదే రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు.
సరసమైన ప్లాన్: ఎయిర్టెల్ IR ప్లాన్లు ఇప్పుడు విదేశాలలో లోకల్ సిమ్‌లను కొనుగోలుకు కన్నా చౌకగా ఉంటాయి.
యాప్ ద్వారా ఫుల్ కంట్రోల్: ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా కస్టమర్లు వినియోగం, బిల్లింగ్, డేటా లేదా నిమిషాలను సులభంగా ఆపరేట్ చేయొచ్చు.
ఈ కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లతో ఎయిర్టెల్ భారతీయ ప్రయాణికులు, ఎన్ఆర్ఐలకు ఇబ్బంది లేని ప్రయాణం చేయొచ్చు. ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు. ఎయిర్టెల్ లేటెస్ట్ IR ప్లాన్లు 189 దేశాలతో కనెక్ట్ అవ్వొచ్చు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!