అధిక శిక్షలు పడేలా చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటున్నాము: సిపి సుదీర్ బాబు
- April 28, 2025
హైదరాబాద్: ఈ రోజు రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ నేరాల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో షెడ్యూల్ కులాలపై దాడులు, వివక్షలకు సంబంధించిన కేసుల పరిణామాలపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ..రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ కేసులను వేగంగా విచారించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసులను పరిశీలించి, వీలైనంత త్వరగా విచారణ పూర్తిచేసి న్యాయం అందించాలన్నారు.ఎస్సీ, ఎస్టీ చట్టం (అట్రాసిటీస్ యాక్ట్) కింద నమోదైన ప్రతి కేసు పట్ల కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ..తమ కమిషనరేట్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ కేసుల్లో విచారణను వేగవంతం చేయడం ద్వారా అధిక శిక్షలు పడేలా చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. న్యాయ ప్రక్రియలో ఎటువంటి ఆలస్యం లేకుండా, బాధితులకు న్యాయం జరిగేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్రం నీలాదేవి, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, డిసిపి మల్కాజ్ గిరి పద్మజ, డిసిపిఎల్బి నగర్ ప్రవీణ్ కుమార్, యాదాద్రి అక్షాన్స్ యాదవ్, డిసిపి క్రైమ్ అరవింద్ బాబు, డిసిపి అడ్మిన్ ఇందిర, డీసీపీ స్పెషల్ బ్రాంచ్ జి.నరసింహారెడ్డి, డిసిపి మహేశ్వరం సునీత రెడ్డి, అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి, అన్ని జోన్ల లాండ్ ఆర్డర్ ఏసీపీలు, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







